బాలీవుడ్ లో జోరు చూపిస్తున్న సమంత!!

P.Nishanth Kumar
సౌత్ లో టాప్ హీరోయిన్ గా నిలిచిన సమంత ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉత్తరాది ప్రేక్షకులను ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ద్వారా ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు సినిమాతో హిందీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అయ్యింది. ఫ్యామిలి మాన్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఈమె నటించబోతుందన్న వార్తలు ఇప్పటికే వెలువడ్డాయి. అలా ఆమె నటిస్తున్న హిందీ సినిమాకు సంబంధించిన విషయాలు మెల్లమెల్లగా రివీల్ అవుతూ ఉండడం అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది.

వరుణ్ ధావన్ తో ముంబై లో హల్చల్  చేసిన ఈ ముద్దుగుమ్మ వీరిద్దరితో ఓ సినిమా ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. అలాగే మరొక రెండు విషయాలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ సినిమా జూలై నెలలో ప్రారంభం కాబోతోందని బాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. షూటింగ్ కోసం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారని తెలుస్తోంది. జూలై నాలుగు లేదా ఐదు తారీకులలో దీన్ని మొదలుపెట్టి ఆరు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసే విధంగా వారు ప్లాన్ చేస్తున్నారు. ముంబై మరియు యౌరప్ లలో ఈ సినిమా షూటింగ్ ను చేయబోతున్నారట. 

ముంబైలోని పలు ముఖ్య పాత్రలతో షూటింగ్ నిర్వహించబోతున్నారు. అలా ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేసే విధంగా వారు ప్లాన్ చేస్తున్నారు. ఇక సమంత హీరోయిన్ గా రెండు తెలుగు సినిమాల్లో నటిస్తుంది. యశోదా మరియు శాకుంతలం అనే రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తున్న ఆమె విజయ్ దేవరకొండ హీరోగా చేసే ఓ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది.  ఆమె తమిళంలో విజయ్ సేతుపతి తో చేసిన ఓ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. చూడబోతే విడాకుల తర్వాత ఆమెకు తెలియదు ఎలాగైతే తన కెరీర్ ఉండాలి అని అనుకుందో అలాగే ఉండబోతుంది అని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: