అందాల బొమ్మ కృతి శెట్టి కి పెళ్లి ప్రపోజల్... ?

VAMSI
ఒక్క సినిమా తోనే భారీ హైప్ ను క్రియేట్ చేసుకుంది టాలీవుడ్ అందాల తర కృతి శెట్టి. ఉప్పెన చిత్రంతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందం అంతకు మించిన అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. కొందరు అభిమానులు అయితే అందం లోనూ, యాక్టింగ్ లోనూ ఈమెను అలనాటి అందాల తార సౌందర్యతో పోలుస్తూ ప్రశంసలు కురిపించారు. ఉప్పెన సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి విజయాలతో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ బామ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఈ బ్యూటీ మొదట్లో బాలీవుడ్ లోనూ ఓ మూవీ చేసింది.
కృతి శెట్టి చదువు తర్వాత  మోడ‌లింగ్ మొద‌లు పెట్టిన మొదట్లో ఆమెకు హిందీలో 2019లో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన 'సూపర్ 30' చిత్రంలో విద్యార్థిగా నటించే అవకాశం వచ్చింది. అందులో ఆమె నటించింది. అలా ఆమెకు బాలీవుడ్ లోని కొన్ని పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత అక్కడ సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. అలా తనకి బాలీవుడ్ లో ఫ్రెండ్ సర్కిల్ పెరిగిందట. అయితే తన క్లోజ్ ఫ్రెండ్ కి స్నేహితుడు అయిన ఒక బాలీవుడ్ యంగ్ హీరో కృతిని పెళ్లి చేసుకోమని ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. కృతి అంటే చాలా ఇష్టమని తన పద్దతులు, అలవాట్లు అన్నీ తనకి దగ్గరగా ఉంటాయి అని అలాంటి అమ్మాయితో లైఫ్ షేర్ చేసుకోవాలనే ఆకాంక్షతో తన ఫ్రెండ్ ద్వారా పెళ్లి ప్రపోజల్ ను కృతి సెట్టి దగ్గరకు పంపినట్లు సమాచారం.
అయితే ఈ విషయం ప్రస్తుతానికి ఒక గాసిప్ అనే తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు. కానీ బేబమ్మ అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారా? ఆమెని ప్రేమించని హృదయం ఉంటుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: