ఇప్పటివరకు ఎన్నో బయోపిక్ సినిమాలు వెండితెరపై వచ్చాయి. అవి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఎంతో మంది గొప్ప గొప్ప వారి జీవిత చరిత్రను, చీకటి కోణాలను ప్రపంచానికి చూపించిన ఈ బయోపిక్ సినిమాలు ఇకపై ప్రేక్షకులను మరింతగా అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఆటల నేపథ్యంలోని బయోపిక్ సినిమాలు ప్రేక్షకులను మరింతగా అలరిస్తాయని చెప్పవచ్చు. ఆ విధంగా ఇప్పుడు బాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొంతమంది క్రికెటర్ల బయోపిక్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.
తాజాగా ఓ మహిళ క్రీడాకారిణి కి సంబంధించిన జీవిత కథతో సినిమా తెరకెక్కుతుంది. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఎన్నో విశేష సేవలు అందించిన మిథాలీ రాజ్ జీవిత కథాంశంతో ఈ సినిమా రాబోతుంది. తాప్సీ టైటిల్ రోల్ ప్లే చేయగా దీనికి సంబంధించిన టీజర్ ను తాజాగా విడుదల చేసారు. ఆమె జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను ప్రధానాంశాలుగా ఈ సినిమా రూపొందింది. 23 సంవత్సరాలుగా టీమిండియాకు సేవలు అందించిన ఏకైక మహిళా క్రికెటర్ మిథాలీ. క్రికెట్ లో చరిత్ర సృష్టించడానికి ఆమె పెద్దగా ఇబ్బంది పడలేదు అనే చెప్పాలి.
నిజం చెప్పాలంటే ఆమె చరిత్ర తిరగ రాసింది అని చెప్పాలి. ఇకపోతే ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో ఎదురు చూసే మరో ఆసక్తికర స్పోర్ట్స్ బియోపిక్ కౌన్ హే తంబే.. ఇప్పటిదాకా ఎంతోమంది క్రీడాకారుల జీవిత చరిత్రలు తెరకెక్కాయి. అవి కొత్తేమి కాకపోయినా కూడా ఓ క్రీడాకారుడి జీవిత చరిత్ర ఎంతో స్పెషల్ అని చెప్పాలి. 41 ఏళ్ల వయసులో ఐపీఎల్ కి ఎంపిక అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆయన తన ప్రయాణం లో ఏ విధమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథ. రిటైర్ అయ్యే వయసులో ఆటను మొదలు పెట్టీ సక్సెస్ అయిన ఆయన జీవితంలోని పలు ఆసక్తికర అంశాలను ఇందులో చూపించనున్నారు. మరి ఈ రెండు బయోపిక్ లు ఏ స్థాయి లో తెరకెక్కుతాయో చూడాలి.