ప్రభాస్ హీరోగా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో ఒకటి నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే సినిమా. అశ్వినీదత్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం పై మొదటి నుంచి ఎన్నో పుకార్లు ప్రచారం జరుగుతూ వచ్చాయి. అలా ఈ సినిమాపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా గురించి ఇప్పుడు మరొక సరికొత్త న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులను తీసుకోవడానికి కారణం ఈ చిత్రం పాన్ ఇండియా సినిమా కావడమే. ఈ నేపథ్యంలో తాజాగా అమితాబచ్చన్ పాత్రకు సంబంధించిన కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఆయన లుక్ ను బట్టి అశ్వద్ధామ పాత్రలో ఆయన కనిపించబోతున్నట్లు గా వార్తలు వినిపిస్తున్నాయి. మహాభారతంలోని ఈ పాత్ర కు అసలు మరణం లేదు. ఈ నేపథ్యంలో ఈ పాత్రకు ఈ సినిమాకు లింక్ పెట్టీ ఈ సినిమా చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. దీనిపై చిత్రబృందం ఎలాంటి వివరణ ఇస్తుందో తెలియదు కానీ ప్రభాస్ ఇతిహాసాలను టార్గెట్ చేస్తూ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రామాయణం ఆధారంగా ఆది పురుష్ చిత్రం చేస్తున్న ప్రభాస్ ఈ చిత్రాన్ని మహాభారతం ఆధారంగా చేస్తున్నాడని తేలింది. అంతే కాదు భవిష్యత్తులో కూడా ఆయన చేసే సినిమాలకు ఇతిహాసాల టచ్ ఉండబోతుంది అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఈ రకమైన సినిమాలను చేసి ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇకపోతే మారుతి దర్శకత్వంలో నీ చిన్న సినిమా ను త్వరలోనే మొదలుపెడుతున్నారు ప్రభాస్.