మెగాస్టార్ చిరంజీవి తన రీ ఎంట్రీ లో వరస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. తన కెరియర్ లో పలు ఆసక్తికరమైన రీమేక్లు చేసిన చిరు ఇప్పుడు వరుసగా రీమేక్ సినిమాలో నటిస్తుండడం విశేషం. ఆయన ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమా అలాగే పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న లుసిఫర్ సినిమాలు రెండు కూడా రీమేక్ సినిమాలే. ఆ విధంగా ఇప్పుడు ఆయన మరో రీమేక్ సినిమా చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇందులో మరొక హీరోకి కూడా ఆస్కారం ఉండడమే ఈ రకమైన బజ్ రావడానికి ముఖ్య కారణం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ పాత్ర లో నటిస్తే బాగుంటుందని చాలా మంది మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అయితే చరణ్ పూర్తిస్థాయి సినిమాలో కాకుండా కొంత భాగం మాత్రమే ఈ సినిమా లో ఉండడంతో మెగా అభిమానులకు సంతృప్తి చెందలేదు. ఈ సినిమాలో చరణ్ పాత్ర సగం లో పూర్తవుతుంది అనడం తో వారు ఈ విధమైన డిమాండ్ చేస్తున్నారు.
ఆ విధంగా మలయాళ చిత్ర పరిశ్రమలో మోహన్ లాల్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ చేసిన సినిమా బ్రో డాడీ సినిమా విడుదలై హిట్ అయ్యింది. ఇందులో వీరిద్దరూ నటిస్తే చాలా బాగుంటుంది అనే చర్చ మొదలయింది. కొంతమంది హీరోలను పరిశీలించిన తరువాత ఈ సినిమాను చిరంజీవి మరియు రామ్ చరణ్ అయితే చాలా బాగుంటుంది అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇద్దరు కూడా వరుస యాక్షన్ చిత్రాల్లో నటిస్తున్న తరుణంలో ఇలాంటి ఒక ఫ్యామిలీ అండ్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఫాదర్ అండ్ సన్ ఈ సినిమా చేసే విధంగా ఆలోచనలు చేస్తారా అనేది చూడాలి. ఇక వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఆచార్య ఏప్రిల్ 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తండ్రీకొడుకులు స్క్రీన్ షేర్ చేసుకున్న పూర్తిస్థాయి సినిమా కావడంతో ఆచార్య పై గట్టి అంచనాలే ఉన్నాయి.