సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా కోసం ప్రేక్షకులు మరియు ఆయన అభిమానులు ఎప్పటినుంచో ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు పలుమార్లు ఈ ఇద్దరు కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమా అధికారికంగా ఇంకా రాకపోవడం పై ఇప్పట్లో ఈ సినిమా ఉంటుందా అన్న అనుమానాలను చాలా మంది వ్యక్తపరిచారు.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో రాజమౌళి ఈ విషయంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా మల్టీస్టారర్ సినిమా అని మహేష్ తో పాటుగా మరో అగ్ర హీరో కి కూడా ఈ సినిమాలో స్థానం ఉండబోతుంది అనే టాక్ వచ్చింది. ఆ విధంగా నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో కనిపించబోతున్నారు అనే పుకార్లు పుట్టుకొచ్చాయి. తాజాగా దీనిపై స్పష్టత ఇచ్చారు జక్కన్న. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో మహేష్ తో చేయబోయే సినిమా మల్టీస్టారర్ చిత్రం కాదని మహేష్ ఒక్కడే ఈ సినిమాలో హీరోగా ఉండబోతున్నాడు అని తెలిపారు.
దీంతో ఈ సినిమా మల్టీస్టారర్ అని వస్తున్న రూమర్స్ కు చెక్ పడినట్లు అయింది. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా త్వరలో రాబోతున్నదుకు అభిమానులు కూడా ఖుషి అయిపోతున్నారు. పది సంవత్సరాల నుంచి ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇప్పటికి కార్యరూపం దాల్చ గా రాజమౌళి ప్రస్తుతం విడుదల చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకునీ మహేష్ తో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఈలోపు మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఆయన చేసిన సర్కార్ వారు పాట చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాలను పూర్తి చేసిన తర్వాత జక్కన్న తో ఆయన చేతులు కలిపే అవకాశం ఉంది.