బిగ్ బాస్ ఓటిటి.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారంటే?

praveen
బుల్లితెరపై బిగ్గెస్ట్ సినీ సెలబ్రిటీ రియాలిటీ షో గా పేరు సంపాదించుకున్న బిగ్ బాస్ ఈసారి సరికొత్తగా ప్రేక్షకులను అలరిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్బాస్ కార్యక్రమం కాస్త ప్రస్తుతం బుల్లితెర పై కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఓటిటి వేదికగా ప్రసారమవుతుంది. అయితే అంతకు ముందు కేవలం ఒక గంట ఎపిసోడ్ మాత్రమే ప్రసారమయ్యేది కానీ ఇప్పుడు  ఏకంగా 24 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారం జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ హౌస్ లో భాగంగా ఎంతోమంది కొత్త కంటెస్టెంట్స్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.


 ఈ క్రమంలోనే బిగ్బాస్ నాన్ స్టాప్ సీజన్ పై ఎంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. కొంతమంది అద్భుతంగా ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే.. మరికొంతమంది మాత్రం  ఈసారి బిగ్బాస్ కార్యక్రమంలో అంత పస లేదు అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ వారం ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం ఇక ఓటీటీ వేదికగా ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షో మూడవ వారం ముగింపుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఆదివారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఒకరిని హౌస్ నుండి ఎలిమినేట్ చేసి బయటికి తీసుకు రానున్నారు.


 అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం అర్జె చైతు బిగ్బాస్ హౌస్ నుంచి ఇక మూడో వారంలో ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఆశలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన అర్జె చైతు హౌస్ లో మూడవ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అంతేకాకుండా ఇక ఇప్పుడు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన మూడవ కంటెస్టెంట్ గా కూడా  నిలువ బోతున్నాడు. అయితే అర్జె చైతు టాస్క్ లో పెద్దగా రాణించక పోవడం..  ఇక హౌస్ లో అతని వైఖరి.. ఇతర హౌస్మేట్స్ పట్ల అతని ప్రవర్తన సానుకూలంగా ఉండకపోవడమే అర్జె చైతు ఎలిమినేట్ కావడానికి కారణం అన్నది తెలుస్తుంది. అయితే ఇటీవల జరిగిన టాస్క్ లో మాత్రం అత్యుత్తమ ప్రదర్శన చేసి చివరికి కెప్టెన్సీ సొంతం చేసుకున్నాడు. అంతలోనే ఎలిమినేట్ అవ్వడం తో ఇక అర్జె చైతు అభిమానులు అందరూ కూడా నిరాశ చెందుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: