నేను నా మాజీ భార్యతో మాట్లాడతా : స్టార్ హీరో

praveen
ఇటీవలి కాలంలో సినిమా హీరో ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం  అనేది సర్వసాధారణంగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొంతమంది పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకే విడాకులతో విడిపోతుంటే.. మరికొంతమంది మాత్రం ఏళ్లనాటి వైవాహిక బంధానికి కూడా మా దారులు వేరు అంటూ గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇక  ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్న సినీ సెలబ్రిటీలు విడిపోతూ ఉండడంతో చివరికి అభిమానులు మొత్తం షాక్ లో మునిగిపోతున్నారు అనే చెప్పాలి.

 టాలీవుడ్ వరకు ఓకే గాని బాలీవుడ్ లో మాత్రం చాలా మంది రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం తర్వాత విడాకులు తీసుకోవడం కొత్త పెళ్లి కోసం రెడీ అవ్వడం లాంటివి చేస్తున్నారు అని చెప్పాలి. ఇందులో మొదటి వరుసలో ఉంటాడు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్. దశాబ్దాల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు అమీర్ ఖాన్. ఎలాంటి పాత్రలోనైనా పరకాయప్రవేశం చేసి అద్భుతంగా నటించగలడు. అయితే అమీర్ ఖాన్ తన సినిమాలతో ఎంతలా హాట్ టాపిక్ గా మారిపోయాడో ఇక తన పెళ్ళిళ్ళు విడాకుల తో కూడా అంతే హాట్ టాపిక్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇప్పటివరకు ఏకంగా ఇద్దరు భార్యల తో విడాకులు తీసుకున్నాడు అమీర్ ఖాన్.

 ఇక విడాకుల తర్వాత భార్యలతో మాట్లాడతాను ఇటీవల చెప్పి అందరినీ షాక్ కి గురి చేశాడు.  తన ఇద్దరు భార్యలతో విడాకుల విషయంపై స్పందిస్తూ.. మేము విడాకులు తీసుకున్న వివాహ వ్యవస్థను గౌరవిస్తాం.. ఇప్పటికీ నా ఇద్దరు మాజీ భార్యలతో అనుబంధం ఉండటం నా అదృష్టం. వారితో మాట్లాడతాను పిల్లల బాధ్యత పై కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటాం అంటూ అమీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. కాగా 1986 లో రీనా దత్తాను  పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్ 2002లో విడాకులు ఇచ్చాడు.. 2005లో కిరణ్ రావు ని పెళ్లి చేసుకొని 2020 లో విడాకులు ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మూడో పెళ్లికి రెడీ అవుతున్నాడు అన్న టాక్ కూడా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: