వెంకీ, బుచ్చిబాబు ల కథేంటి!!

P.Nishanth Kumar
కొంతమంది యువ దర్శకులకు ఎంతటి అదృష్టం ఉంటుంది అంటే వారు చేసింది అతి తక్కువ సినిమాలే అయినా కూడా పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాన్ని అతి తొందరగా అందుకుంటూ ఉంటారు. ఒకటి రెండు సినిమాలు చేసిన తరువాత పెద్ద హీరోలు వారిని నమ్మి సినిమా ఇవ్వడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు. అలా ఇప్పటి వరకు పెద్ద దర్శకులకు మాత్రమే మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేసే అవకాశం దక్కింది. అంత పెద్ద హీరోతో సినిమా చేయాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి అలా  ఈ అదృష్టం వెంకీ కుడుముల కి వచ్చిందని చెప్పాలి.

ఇక బుచ్చిబాబు కు  కూడా తన రెండో సినిమానే ఎన్టీఆర్ తో చేస్తూ ఉండడం విశేషం. తొలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయినా కూడా రెండో సినిమాకు పెద్ద హీరో అవకాశం ఇవ్వడం అంటే నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. చిన్న దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా చూసే విధంగా ముందుకు వెళ్లడం కూడా నిజంగా అందరినీ అబ్బుర పరిచే విషయం అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు దర్శకుల కథ ఎంత బాగా ఉంటే తప్ప ఈ అగ్ర దర్శకుల సినిమాలను వారు ఒప్పుకోరు అనే విషయం ఇప్పుడు బయటకు వినిపిస్తుంది.

ఎన్టీఆర్ తో బుచ్చిబాబు చేయబోయే సినిమా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇందులో మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. తప్పకుండా ఎన్టీఆర్ కు మంచి విజయాన్ని తెచ్చి పెట్టే సినిమా అవుతుంది అని అందరూ భావిస్తున్నారు. చిరంజీవితో చేయబోయే వెంకీ కుడుముల సినిమా కూడా మెగాస్టార్ చిరంజీవి అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా పాత్రలో కనిపించబోతున్నాడట. ముఠా మేస్త్రి తర్వాత ఆ తరహాలో సినిమాలో ఆయన కనిపించబోతున్నాడని అంటున్నారు. ఈ విధంగా ఈ ఇద్దరు దర్శకులు తమ కథలతోనే తమను తాము నిరూపించుకునీ పెద్ద హీరోలతో సినిమాలు చేసే విధంగా ముందుకు వెళుతున్నారు అని చెప్పవచ్చు. ఇవి ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: