త్రిబుల్ ఆర్ రికార్డ్.. తొలి భారతీయ సినిమా?

praveen
పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి  రాజమౌళి దర్శకత్వం వహించడం.. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ లో టాప్ హీరోలుగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్  లు నటించటం అంతకుమించి.. ఇద్దరు హీరోలు స్వతంత్ర సమర యోధులైన అల్లూరి సీతారామరాజు కొమురంభీం పాత్రలో నటించడంతో ఈ సినిమాపై ఊహించని రేంజిలో అంచనాలు పెరిగిపోయాయి.




 ఈ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఎన్నో సార్లు విడుదల తేదీని ప్రకటించినప్పటికీ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిందని చెప్పాలి. ఇకపోతే ఎట్టకేలకు మార్చి 25 వ విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. విడుదలకు ఎన్నో రోజుల సమయం లేకపోవడం తో ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది చిత్రబృందం. ప్రపంచ వ్యాప్తం గా ఈ సినిమా ఎంతో ఘనం గా విడుదల అయ్యేందుకు అంతా సిద్ధమైపోయింది.


 అయితే పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ఇక ఇప్పుడు ఒక అరుదైన రికార్డును సాధించింది అన్నది తెలిసిందే. త్రిబుల్ ఆర్ మూవీ గురించి ఇటీవల చిత్ర యూనిట్ ఒక కీలక ప్రకటన చేసింది. మంచి క్వాలిటీ కోసం డాల్బీ సినిమా తో కలిసి త్రిబుల్ ఆర్ సినిమా విడుదల చేయబోతున్నాం అంటూ ప్రకటించింది. అయితే ఇలా డాల్బి సినిమా తో కలిసి విడుదలవుతున్న తొలి భారతీయ సినిమా త్రిబుల్ ఆర్ మాత్రమే కావడం గమనార్హం. ఇక దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అధికారికంగా ఒక పోస్టు ద్వారా వివరాలను వెల్లడించింది త్రిబుల్ ఆర్ చిత్రబృందం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rrr

సంబంధిత వార్తలు: