పెళ్లికి ముందు వరకు సమంత చాలానే గ్లామర్ షో చేసింది. పెళ్లి తర్వాత కూడా ఓ మోస్తరు గ్లామర్ షో చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. దాదాపు దశాబ్దం పాటు సమంత అదే దారిలో కొనసాగింది. అయితే చైతన్య తో పెళ్లి తర్వాత చాలా మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. ఆమె దిగిన ఫోటోలు అప్పట్లో పెద్ద సంచలనమే. అక్కినేని అభిమానులు ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దానికి తగ్గట్లుగానే ఆమె ఆ తర్వాత కాలక్రమంలో ఎలివేషన్స్ పెంచుకుంటూ పోయింది. సినిమాల పరంగా విధానం మారింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల పైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ వచ్చింది.
హైలెట్ అయ్యేటు వంటి అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్ళింది. దీంతో నెమ్మది నెమ్మదిగా సమంత పై ఉన్న అభిప్రాయం అందరిలో తొలిగిపో యింది కానీ ఒక్కసారిగా చైతన్య తో విడాకులు తీసుకున్న సమంత గ్లామర్ షో చేయడంలో రెచ్చిపోయింది. పుష్ప ఐటమ్ సాంగ్ లో గతంలో ఎప్పుడు చూడ ని విధంగా తనలోని సరికొత్త కోణాన్ని వెండితెరపై ఆవిష్కరించిన సమంత 35 కు చేరువలో ఉన్న కూడా ఈ తరహాలో అందాలు వెదజల్లడం విశేషం. పెళ్ళైన తర్వాత సినిమాలను రాబట్టుకోవాలంటే ఈ మాత్రం చేయక తప్పదు.
అయితే కెరీర్ ప్రారంభంలో చేయవలసిన పనులు విడాకుల తర్వాత కూడా ఆమె చేయడం చర్చనీయాంశం అవుతుంది. తాజాగా ఆమె మరొకసారి గ్లామర్ షో చేసి అందరి నోళ్లలో నానుతోంది. నెటిజన్స్ ఆగ్రహానికి గురవుతుంది. ప్రస్తుతం ఆమె ఉమెన్ సెంట్రక్ చిత్రాలను చేసే అవకాశాలు వస్తున్నాయి. శాకుంతలం మరియు యశోద అనే రెండు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో ఆమె నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ తో కూడా సమంత కాంబో లో ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమా ఆమెకు బ్రేక్ ఇస్తుందా చూడాలి.