ఇంత చేస్తున్నా ఈమెను ఎవరు పట్టించుకోవట్లేదు గా!

P.Nishanth Kumar
కొంతమంది హీరోయిన్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వారికి ఏ మాత్రం అదృష్టం కలిసి రాక అతి తక్కువ సమయాన్ని సినిమా పరిశ్రమలో కొనసాగించి మెల్లమెల్లగా అవుట్ అయి పోతూ ఉంటారు. అలాంటి వారిలో ఒక హీరోయిన్ షాలిని పాండే. తెలుగు సినిమా పరిశ్రమలోకి అర్జున్ రెడ్డి వంటి సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అగ్ర హీరోయిన్ గా మారడం ఖాయం అనుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమ గురించి అభివర్ణించాలంటే అర్జున్ రెడ్డి సినిమా కి ముందు అర్జున్ రెడ్డి సినిమాకి తర్వాత అని అంటూ ఉంటారు.

ఆ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా స్టార్స్ అయ్యారు. దర్శకుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అగ్ర దర్శకుడిగా మారాడు. హీరో విజయ్ దేవరకొండ కూడా స్టార్ హీరోగా మారాడు. అయితే ఈ సినిమాలో చేసిన ఈ హీరోయిన్ మాత్రం ఎందుకో పెద్ద హీరోయిన్ కాదు కదా మంచి సినిమాలు కూడా చేయలేని హీరోయిన్ గా ఎదగలేక పోయింది. కారణం ఏదైనా కూడా ఓ మంచి నటి కాలేకపోయింది. ఈమె కు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో తెలియదు కానీ తన ఆశలు కోల్పోకుండా సినిమాలలో అవకాశాలు సంపాదించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందనే చెప్పాలి. 

సోషల్ మీడియా లో కొంత మంది ముద్దుగుమ్మలు చేస్తున్న అందాల రచ్చ గురించి అందరికీ తెలిసిందే వారు సినిమా అవకాశాల కోసం అలాగే తమ సోషల్ మీడియా ఖాతాలను ఇంప్రూవ్ చేసుకోవడం కోసం రోజుకో రకంగా తమ అందాలను వెదజల్లుతూ వాటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోల కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ బాగానే వస్తుంది. ఇలాంటి సమయంలో ఆమె మంచి ఫోటోలు అప్లోడ్ చేస్తున్న ఈ నేపథ్యంలో అదృష్టం కలిసి వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నాలు చేస్తుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: