ప్రభాస్ సినిమాలో.. దళపతి విజయ్ హీరోయిన్?
ఇక ఈ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం కొలీవుడు లో మాత్రమే కాదు టాలీవుడ్ లో సైతం సూపర్ హిట్ అందుకుంది ఈ సినిమా. ఇక ఇళయదళపతి విజయ్ కి టాలీవుడ్ లో మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఇక ఈ సినిమాలో తన అందం అభినయం నటనతో కూడా ఆకట్టుకుంది మాళవికా మోహనన్. ఇక తమిళంలో కూడా పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ బిజీ హీరోయిన్గా మారిపోయింది.అయితే ఈ అమ్మడుకి మాత్రం టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆసక్తి కాస్త ఎక్కువగానే ఉందట.
కానీ టాలీవుడ్ నుంచి మాత్రం ఏ ఆఫర్ కూడా ఈ అమ్మడి తలుపు తట్టడం లేదు అని చెప్పాలి. గతంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఒక సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ సినిమా మాత్రం ప్రారంభం అవ్వకుండానే క్యాన్సల్ అయింది అన్న టాక్ వుంది. ఇప్పుడు ప్రభాస్కు జోడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోయే రాజా డీలక్స్ సినిమాలో మాళవికా మోహనన్ ను హీరోయిన్గా ఎంపిక చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. నేను ఒక సినిమా చేయబోతున్నాను అది ఖచ్చితంగా పెద్ద సినిమా. నాకు తెలుగులో ఒక మంచి సినిమా వచ్చింది అంటూ మాలవిక తెలిపింది. దీంతో పెద్ద సినిమా అనే సరికి అది ప్రభాస్ సినిమానే అని అందరూ ఫిక్స్ అయి పోతూ ఉన్నారు.