ఆడవాళ్ళూ మీకు జోహార్లు : అంత లేదన్నారు .... బాగానే లాగుతుందే ... ??
ఇక ఇటీవల విడుదల తరువాత యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది ఈ మూవీ. తన గత సినిమాల మాదిరిగానే మరొక్కసారి కుటుంబ బంధాలు, అలానే ఎమోషన్స్ ని కలగలిపి ఈ మూవీ తీసిన కిషోర్, సినిమాని చాలావరకు మంచి ఎంటర్టైనింగ్ గా ముందుకు నడిపారు. అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సినిమా సెకండ్ హాఫ్ అంతగా ఆకట్టుకోదని, చాలా వరకు సెకండ్ హాఫ్ ల్యాగ్ గా ఉందని కొందరు ప్రేక్షకాభిమానులు మూవీ పై కామెంట్స్ చేస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే, ఈ వీకెండ్ లో ఈ మూవీ చాలా వరకు అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ రాబట్టిందని, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి బాగా కనెక్ట్ అయినట్లు చెప్తున్నారు విశ్లేషకులు.
మరోవైపు మూవీ కి టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ వస్తుండడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. అయితే నేడు సోమవారం కావడంతో ఆడవాళ్ళూ మీకు జోహార్లు మూవీకి నేటి నుండి గట్టి అగ్నిపరీక్ష ఎదురుకానుంది. మరి ఇవాళ్టి నుండి ఈ సినిమా ఎంతవరకు రాబడుతుందో చూడాలని, దానిని బట్టి పక్కాగా ఈ సినిమా రేంజ్ ని చెప్పేయొచ్చని విశ్లేషకులు అంటున్నారు. మరి ఓవరాల్ గా ఈ మూవీ ఎంత రేంజ్ లో దూసుకెళ్లి కలెక్షన్స్ కొల్లగొడుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.