బర్తడే: కమలినీ ముఖర్జీ గురించి తెలియని కొన్ని విషయాలు..!!
ముంబైలో ఉంటున్నప్పుడు.. పారాషూట్, ఫేర్ అండ్ లవ్లీ, బ్రిటానియా, తదితర బ్రాండ్ల ప్రకటన మోడలింగ్ చేసింది. ఇక అలా చేస్తున్న సమయంలోనే "ఫిర్ మిలేంగే" అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. మొదట సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే కాస్త భయం వేసిందట. కానీ ఆ తర్వాత తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆ సినిమాలో నటించింది అందులో శిల్పాశెట్టికి సోదరి పాత్రలో నటించింది. ఇక అలాంటి సమయంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఆనంద్ చిత్రానికి కథానాయికల కోసం వెతుకుతూ ఉన్నాడట.
ఒక ప్రకటనలో చూపిన విధంగా ఈమె ఆ సినిమాకి ఎంపిక చేయడం జరిగిందట. ఇక ఈ సినిమాలో ఈమె నటనకు నంది అవార్డు కూడా వచ్చింది. ఇక ఈ సినిమాకు ఏకంగా నాలుగు నంది అవార్డులు వచ్చాయట. ఇక ఆ తర్వాత 2005లో మీనాక్షి అనే సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత గోదావరి వంటి సినిమాలలో నటించింది. ఇక తరువాత ఈమె తమిళంలో కూడా కొన్ని సినిమాలలో నటించింది. ఇక ఈమె బెంగాలి,మలయాళం లో కూడా కొన్ని సినిమాలలో నటించింది. ఈమె తన సంస్థ ద్వారా కొంతమంది పిల్లలకు సామాజిక సేవ చేస్తోంది. చివరిగా ఈమె మన్యంపులి సినిమాలో నటించింది.