వరుణ్ ఎందుకంత కన్యూజ్ అవుతున్నాడు..!!

P.Nishanth Kumar
ప్రస్తుతం వరుసగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఫిబ్రవరి లో వరుస పెద్ద క్రేజీ సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. అవి ఎంతవరకు విజయం సాధించాయి అనే విషయం పక్కనపెడితే ప్రేక్షకులను మాత్రం భారీగానే అలరించాయి. అలా ఇటీవల భీమ్లా నాయక్ సినిమా అందరిని ఎంతో బాగా అలాయించింది. వాస్తవానికి ఈ సినిమా ఆరోజున వస్తుందో రాదో అన్న అనుమానాలను కనపరచగా వరం ముందు ఈ సినిమా వస్తుందనే క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

ఏదైతేనం పవన్ అభిమానులు కోరుకున్న ఈ సినిమా వచ్చి అందరిని భారీగా అలరించింది. అంతేకాదు ఈ సినిమా రావడం వల్ల ఆ రోజున రావాల్సిన మరికొన్ని సినిమాల విడుదల లు ఆగిపోయాయి. శర్వానంద్ హీరో గా నటిస్తున్న ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమా ను వచ్చే వారానికి పోస్ట్ చేయగా మార్చి 4 వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే అదే సమయంలో పోస్ట్ చేసుకున్న గని సినిమా మాత్రం ఇప్పటివరకు ఎలాంటి విడుదల తేదీని కంఫర్మ్ చేసుకోలేదు. దాంతో వరుణ్ తేజ్ కన్ఫ్యూజ్ కి కారణం ఏంటని అంటున్నారు ఫాన్స్.

కిరణ్ అనే దర్శకుడితో కలిసి వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా ను అనౌన్స్ చేసిన దగ్గరినుంచి దీనిపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అయితే ఎందుకో తెలీదు కానీ ఈ సినిమా మొదటినుంచి నెగెటివ్ వైబ్రేషన్స్ ఉంటున్నాయి. విడుదల కు కూడా నోచుకోకపోవడంతో అందరిలో ఈ సినిమా పై పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల విషయం లో త్వరగా ఓ నిర్ణయం తీసుకోకపోతే వరుణ్ సినిమా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇప్పటికైనా ఈ నెలలో ఈ సినిమా ను విడుదల చేయాలి. లేదంటే పెద్ద పెద్ద సినిమాలు విడుదల కు సిద్ధమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: