డీజే టిల్లు తో మంచు లక్ష్మి డాన్స్.. వీడియో వైరల్?
అప్పుడప్పుడు తన అభిమానులతో ముచ్చటించడమె కాదు ఇక తన పర్సనల్ లైఫ్ లో ఏం జరిగినా ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది మంచు లక్ష్మి. అయితే మంచు లక్ష్మీ ఏదైనా పాటపై డాన్స్ చేసి ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టింది అంటే చాలు ఇక అదే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోతూ ఉంటుంది.. ఇలా మంచు లక్ష్మి ఏ పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.
ఇక ఇప్పుడు ఇలాంటి ఒక డాన్స్ వీడియో తన ఇన్స్టాగ్రామ్ ఖాతా లో అప్లోడ్ చేసింది మంచువారి అమ్మాయి. ఇక ఈ వీడియో కాస్త అభిమానులందరినీ తెగ ఆకర్షిస్తోంది. ఇక ఈసారి తన స్నేహితుడు సిద్దు జొన్నలగడ్డ తో కలిసి ఒక పాటపై డాన్స్ చేసింది. ఇక హీరో సిద్దు జొన్నలగడ్డ తో పాటు ఆమన్ కూడా చిందులేశాడు. ముగ్గురు కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు అయితే గతంలో డీజే టిల్లు మూవీ లో నుంచి ఫేమస్ మాస్ సాంగ్ పై అదిరిపోయే ఊర మాస్ స్టెప్పులు వేసి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అన్న విషయం తెలిసిందే. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్కేయండి..