ఆ సమయంలో చనిపోవాలనుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న బాబూమోహన్?
ఆ తర్వాత కాలం లో చిత్ర పరిశ్రమలో అవకాశాలు తగ్గి పోవడంతో రాజకీయాల వైపు అడుగులు వేశారు బాబూ మోహన్. ఇక టిఆర్ఎస్ పార్టీ తరఫున ఒకసారి ఎమ్మెల్యేగా గెలు పొందారు. కానీ ఆ తర్వాత టిఆర్ఎస్ టికెట్ ఇవ్వక పోవడం తో బీజేపీ పార్టీలో చేరారు బాబు మోహన్. ఇకపోతే ఇటీవలే బాబు మోహన్ తన కుమారుడు దూరమైన విషయాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల ఈ టీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమం లో పాల్గొన్నారు బాబు మోహన్. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల చేశారు.
ఈ క్రమం లోనే ప్రోమోలో భాగంగా బాబు మోహన్ మాట్లాడుతూ మా బాబు గుర్తొచ్చాడు.. ఆ ఫోటోల గురించి నేను చెప్పలేను.. అప్పుడు అస్తి పంజరం లా మారి పోయాను.. చివరికి చనిపోవాలి అని కూడా అనుకున్నాను అంటూ బాబు మోహన్ బావోద్వేగానికి గురయ్యారు. ఇక బాబు మోహన్ కొడుకు చిన్న వయసు లోనే రోడ్డు ప్రమాదం లో మరణించిన విషయం తెలిసిందే. ఇక కొడుకు మరణం తర్వాత ఎంతగానో కుంగి పోయినా బాబు మోహన్ ఎన్నో రోజుల పాటు సినిమాలకు దూరం గా కూడా ఉన్నారు.