ఓటీటీ ఆ హీరోయిన్స్ కి వరం అవుతుందా..!!

P.Nishanth Kumar
కొంతమంది హీరోయిన్ లకి అదృష్టం కలిసి రాక తమకు కెరీర్ ను మధ్యలోనే అర్ధాంతరంగా ముగిస్తూ ఉంటారు. మంచి నటన భారీ గ్లామర్ ప్రదర్శించిన కూడా వారికి సినిమాలో ఏమాత్రం కలిసి రాదు. ఆ విధంగా కొంతమంది హీరోయిన్లు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మధ్యలోనే తమ కెరీర్ను ముగించుకొని వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు వారికి వరం లా మారుతుంది ఓటీటీ ట్రెండ్. 

పెద్ద హీరోయిన్ లు ఈ ఓ టీ టీ సినిమాల్లో నటించరు కాబట్టి కొంత క్రేజ్ వున్న హీరోయిన్లకు మంచి మంచి అవకాశాలు దక్కుతున్నాయి ఇక్కడ. అంతేకాదు సినిమా పరిశ్రమలో బాగా రాణించి క్రమక్రమంగా సినిమా అవకాశాలు తగ్గుతున్న కొంతమంది కథానాయకులకు ఇక్కడ మంచి మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పవచ్చు. ప్లాట్ ఫామ్ ఏదైతేనేమి సినిమా అవకాశాలు రావడం ముఖ్యం అంటూ ఇక్కడ మంచి మంచి సినిమాలు చేయడం మొదలుపెట్టారు కథా నాయికలు. ఆ విధంగా తమన్నా సమంత కాజల్ వంటి సీనియర్ హీరోయిన్ లు ఈ ప్లాట్ ఫామ్ లో మంచి అవకాశాలు రాబట్టుకన్నారు.


ఇప్పుడు ఫేడవుట్ అయిపోయిన కొంతమంది హీరోయిన్ లకి సైతం పిలుపు వస్తుందట. వారికి వెబ్ సిరీస్ లో నటించాలని ఆఫర్లు వస్తున్నాయ ట. కొంతమంది దర్శక నిర్మాత లు వెతికి వెతికి మరీ వారి అడ్రస్ లను సంపాదించి వారిని నటించాలని కోరుతున్నారట. దీంతో అందివచ్చిన అవకాశాన్ని అందుకుని మళ్ళీ తమ కెరీర్ను ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలని సదరు హీరోయిన్లు భావిస్తున్నారు. దాదాపుగా తమ సినిమా కెరియర్ అయిపోయింది అని భావించిన హీరోయిన్లు సైతం మళ్ళీ సినిమాల్లో నటించే విధంగా వర్కవుట్లు చేస్తున్నారట. మరి ఓ టి టి ట్రెండ్ ఎవరికి ఎంత లాభం ని తీసుకు వస్తుందో తెలియదు కానీ హీరోయిన్లకు మాత్రం ఈ ట్రెండ్ బాగా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: