నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను.. సమంత ఎమోషనల్ పోస్ట్?

praveen
గతంలో నాగచైతన్యతో విడాకుల అంశంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది సమంత. ఇక విడాకుల తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమవుతుందని అందరూ అనుకుంటే... వరుస సినిమాలను సైన్ చేస్తూ అంతకుమించిన స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇక ఇటీవల అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాలో ఊ అంటావా ఉహూ అంటావా అని ఐటమ్ సాంగ్ లో తన కోర చూపులతో అందరి మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ అటేన్షన్ మొత్తం తన వైపు తిప్పుకోవడం లో సక్సెస్ అయింది అని చెప్పాలి.


 ఇక మొన్నటివరకూ విడాకులతో వార్తల్లో నిలిచిన సమంతా ఇక ఇప్పుడు మాత్రం తన సినిమాలతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయింది. కొత్తగా సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నప్పటికీ అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ఆసక్తికర పోస్టులతో అభిమానులందరినీ అలరిస్తూ వస్తోంది సమంత. ఇక గత కొంత కాలం నుంచి సమంత ఏ పోస్ట్ పెట్టినా కూడా అది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. సమంత చైతు గురించి ఏమైనా మాట్లాడుతుందా అని అటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


 ఇకపోతే ప్రస్తుతం షూటింగ్ లో కాస్త గ్యాప్ దొరకడంతో కేరళలో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది హాట్ బ్యూటీ సమంత. ఇక అక్కడ బీచ్ ఒడ్డున స్నేహితులతో  దిగిన కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలు పోస్టు చేసింది. ఈ సందర్భంగా ఒక కామెంట్ ను కూడా దీనికి జత చేయడం గమనార్హం. నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను అంటూ క్యాప్టెన్ జోడించింది సమంత. దీంతోపాటు బెస్ట్ ఫ్రెండ్స్ అని హ్యాష్ ట్యాగ్ కూడా జత చేయడం గమనార్హం. సమంత ఈ ఫోటో సోషల్ మీడియాలో పెట్టిందో లేదో క్షణాల వ్యవధిలో వైరల్ గా మారిపోయింది. ఇకపోతే ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో నటిస్తోంది . అదే సమయంలో యశోద సినిమాలో కూడా నటిస్తూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: