ప్రభాస్ హీరోగా నటించిన సినిమాలు ఇప్పుడు వరుసగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాయి. ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ చిత్రం మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. అలా సాహో సినిమా తర్వాత దాదాపుగా మూడు సంవత్సరాలకు ప్రభాస్ సినిమా రావడం తో ఆయన అభిమానులు మార్చి 11వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ఇంకా ఇరవై రోజుల సమయం ఉందడం తో వారు ఆ సినిమాకు భారీ గా సంబరాలు చేసుకోవాలని ప్రణాళికలు రచించుకుంటున్నారు.
అయితే కరోనా కారణంగా సినిమాలు విడుదల చేయలేక పోయిన ప్రభాస్ షూటింగ్ లను మాత్రం వరుసగా చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు ఆయన నటించిన మూడు చిత్రాలు మరో రెండు నెలల్లో రెడీ అయిపోతున్నాయి. విడుదలకు సిద్ధం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు సినిమాల నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసే విషయంలో పోటీ పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఓకే హీరో కు సంబంధించిన మూడు సినిమాలు ఈ విధంగా పోటీపడటం నిజంగా ఎంతో ఆశ్చర్యానికి గురి చేసే విషయమే అవుతుంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ చిత్రాన్ని రాధే అభం చిత్రం తర్వాత విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే ఇప్పుడు రేసులోకి ఆది పురుష్ చిత్రం కూడా రావడం తో ప్రభాస్ కు ఏమి చేయాలో అన్న ఆలోచనలు మొదలవుతున్నాయి. పోనీ అతి తక్కువ గ్యాప్ లో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తూ ఉండగా కలెక్షన్ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని మరొక ఆలోచన కూడా వీరు చేస్తున్నారట. అంతే కాదు ఈ ఎఫెక్ట్ ప్రభాస్ కెరియర్ పైన కూడా పడుతుంది అని వారు భావిస్తున్నారు. మరి ఇంతటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రభాస్ సినిమాలు ఏ విధంగా విడుదలను జరుపుకుంటాయో చూడాలి.