దక్షిణాదిన భారీ సినిమాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకొని ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశాడు దర్శకుడు శంకర్. ఆయన సినిమాల కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తి గా ఎదురుచూసేది. ఆయన సినిమాలు బాగున్నన్ని రోజుల ఎలాంటి ఇబ్బంది కాలేదు ఎవరికీ. అయితే ఎప్పుడైతే ఆ సినిమాలు కలెక్షన్లు రాబట్టలేకపోయాయో అప్పటి నుంచి ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఏ సినిమా కూడా మధ్యలో ఆగిపోదు అని మొదట్లో అందరూ అనుకున్నారు కానీ అలాంటి విచిత్రమే జరిగింది కమలహాసన్ సినిమా విషయంలో.
ఆయన గతంలో దర్శకత్వం వహించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 అనే సినిమా మొదలు పెట్టిన శంకర్ చిత్రాన్ని మధ్యలో ఆపేసి ఇప్పుడు వేరే సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఆ సినిమా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని చెప్పవచ్చు. ప్రస్తుతం రామ్ చరణ్ తో ఆయన తెలుగు సినిమా చేస్తున్నాడు. తమ గత సినిమాల కంటే ఏ విధంగానూ తక్కువ కానీ బడ్జెట్ తో భారీ స్థాయిలో సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంతో తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలని కూడా చూస్తున్నాడు.
అయితే ఈ సినిమా తర్వాత కూడా ఆయన తెలుగులో మరొక సినిమా చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే అపరిచితుడు సినిమాను హిందీ లో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం చేశాడు. అక్కడ రణవీర్ కపూర్ హీరోగా ఆ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా పూర్తి కాగా ఇప్పుడు మరొకసారి ఆ సినిమా యొక్క స్క్రిప్ట్ ను రివైజ్ చేస్తున్నాడట. ఇంకోవైపు రామ్ చరణ్ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేయబోతున్నాడట. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల తర్వాత ఆయన తెలుగులో పెద్ద హీరోతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తమిళ ప్రేక్షకులు ఆయనపై ఎలాంటి విమర్శలు చేస్తారో చూడాలి.