నాని జోరు.. కీర్తి కి కలిసి వచ్చేనా!!

P.Nishanth Kumar
వరుస ఫ్లాపులు వస్తున్న నానికి శ్యామ్ సింగ రాయ్ చిత్రం కలిసి వచ్చింది. ఆ సినిమా ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. దాంతో ఫామ్ ను తిరిగి తెచ్చుకున్న నాని ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఆయన చేసిన అంటే సుందారానికి సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తిగా చేశాడు. ఈ సినిమాలో మలయాళ కథానాయిక నజ్రియా హీరోయిన్ గా నటిస్తుండగా తెలుగులో ఆమె ఈ సినిమాతోనే ఎంట్రీ ఇస్తూ ఉండడం విశేషం. అంతకు ముందు కొన్ని డబ్బింగ్ సినిమాలతో ఆమె ప్రేక్షకులను ఎంతో అలరించింది. 

ఆ విధంగా అతి తక్కువ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసిన నాని ఇప్పుడు మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. దసరా అనే ఓ వినూత్నమైన సినిమా ను కొత్త దర్శకుడితో చేయడానికి సిద్ధమవుతున్నాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా నిన్న మొదలుపెట్టింది చిత్ర బృందం. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఇద్దరూ అభిమానుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

గత కొన్ని రోజులుగా కీర్తి సురేష్ కెరియర్ కూడా ఏమంత బాగోలేదు. కొన్ని లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో చేసి ఆమె చేతులు కాల్చుకుంది. పెద్ద హీరోల సినిమాలు చేయడం మానేసిన నేపథ్యంలో ఇప్పుడు చేయబోతున్న సర్కారు వారి పాట చిత్రంపైనే ఆమె ఆశలు పెట్టుకుంది. ఆ తర్వాత ఆమె పూర్తిగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు మానేసి పెద్ద హీరోలతో సినిమాలు చేయాలని కోరుకున్నారు. ఆ విధంగానే ఇప్పుడు నాని సరసన ఓ సినిమా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కమర్షియల్ చిత్రాల్లో చేయడానికి రెడీ అన్నట్లుగా సంకేతాలు ఇచ్చింది. మరి ఇ కీర్తి సురేష్ ఇటు నాని ఇద్దరికీ కూడా హిట్ అవసరం ఉన్న సమయంలో ఈ సినిమా వారికి హిట్ టాక్ తీసుకు వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: