భీమ్లా నాయక్ : ఆ లుక్ పై ఫ్యాన్స్ అసంతృప్తి ?

Purushottham Vinay
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు జెట్ స్పీడులో ఒకేసారి ముగ్గురు నలుగురు దర్శకులకు లైన్ క్లియర్ చేసి వేగం పెంచారు. ఇక ఆయన రాజకీయ షెడ్యూళ్ల కనుగుణంగా ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా వేగంగా సినిమాల్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. అయితే ఇక్కడే ఒక సమస్య అనేది వచ్చి పడింది. ఆయన ఒక సినిమా సెట్ నుంచి ఇంకో సినిమా సెట్ కి వెళుతుంటే వేషధారణను మార్చడం మాత్రం అంత సులువుగా లేదు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వీరమల్లు షెడ్యూల్స్ ని పరుగులు పెట్టించే ఆలోచనలో ఉన్నాడు. దానికి కొంత ప్రిపరేషన్ తో కూడా ఉన్నాడు. ఇక వీరమల్లు పాత్ర కోసం పవన్ పొడవుగా జులపాల జుట్టు పెంచిన సంగతి తెలిసిందే. అయితే సమస్య అంతా ఇక్కడే ఉంది. ఇదే గెటప్ తో అతడు భీమ్లా నాయక్ సినిమా పెండింగ్ చిత్రీకరణలో పాల్గొనడంతో ఆ హెయిర్ స్టైల్ నాన్ సింక్ గా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 


తాజాగా భీమ్లా నాయక్ సెట్ నుంచి ఫోటో లీక్ అవ్వడంతో ఇది బయటపడింది.పైగా ఆ లుక్ లో పవన్ అంతగా బాగా లేడని ఫ్యాన్స్ అసంతృప్తి చెందుతున్నారు.నిజానికి భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ అంతా కూడా పూర్తయింది. పాట షూటింగ్ లో పాల్గొనేందుకు ఇప్పుడిలా పవన్ కళ్యాణ్ రావాల్సొచ్చింది. అయితే పాటలోనే కాబట్టి ఎలాగోలా మ్యానేజ్ చేసేయొచ్చని భావించి ఉండవచ్చు.. అని వారు ఊహిస్తున్నారు.ఇక సంక్రాంతి సినిమా బరి నుంచి మిస్సయిన భీమ్లా నాయక్ సినిమా తొందర్లోనే థియేటర్లలోకి వచ్చి సందడి చెయ్యబోతున్నాడు. పవన్ అభిమానులు కూడా ఆ ఎగ్జయిటింగ్ క్షణం కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు కుమ్మడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.ఈలోగానే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల సమస్య కూడా ఇంకా తేలాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: