యువ దర్శకులు కదా అని తక్కువ అంచనా వేయకండి..!
'బాహుబలి'తో భారీ హిట్ కొట్టిన ప్రభాస్ భారీ సినిమాలు చేస్తున్నాడు. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్‌తో సినిమా సినిమాకి మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నాడు. అయితే భారీ టార్గెట్స్‌తో ఉన్న ప్రభాస్ యంగ్ డైరెక్టర్స్‌కి ఎక్కువగా ఆఫర్స్ ఇస్తున్నాడు. ఒకే సినిమా ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సుజిత్‌తో 'సాహో' చేశాడు. అలాగే 'జిల్' మాత్రమే తీసిన రాధాక్రిష్ణ కుమార్‌తో 'రాధేశ్యామ్' చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ రెండో సినిమా 'మహానటి'తోనే ఇండస్ట్రీని మెప్పించాడు. సావిత్రి బయోపిక్‌ని చాలా ఎమోషనల్‌గా తీశాడని స్టార్ హీరోస్ కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇక ఈ మూవీతో నేషనల్‌లెవల్‌లో సత్తాచాటిన నాగీ, ఇప్పుడు ప్రభాస్‌తో వరల్డ్‌క్లాస్ మూవీ తీస్తున్నాడు. 'ప్రాజెక్ట్ కె' పేరుతో రూపొందుతోన్న ఈమూవీలో అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు.
హీరోలకి కావాల్సింది సూపర్ హిట్. నిర్మాతలకు కావాల్సింది లాభాలు తెచ్చి పెట్టే దర్శకులు. సో ఈ లెక్కలని మ్యాచ్ చేస్తే చాలు.. డైరెక్టర్ ఏజ్, ఎక్స్‌పీరియన్స్‌ని ఎవరూ పట్టించుకోరు. సూపర్ హిట్ తీస్తాడనే నమ్మకం తెచ్చుకుంటే బడా హీరోలు పిలిచీ మరీ అవకాశాలు ఇస్తారు. బిజీగా ఉన్నామంటే వెయిట్ చెయ్యడానికి కూడా రెడీ అంటారు. సందీప్ వంగా ఫస్ట్ మూవీ 'అర్జున్ రెడ్డి'తో ఇండస్ట్రీలో చిన్నపాటి సంచలనం సృష్టించాడు. ఈ బోల్డ్ లవ్‌స్టోరీకి బాలీవుడ్ జనాలు కూడా ఇంప్రెస్ అయ్యారు. హిందీలో 'అర్జున్ రెడ్డి'ని 'కభీర్ సింగ్'గా రీమేక్ చేస్తే అక్కడా బ్లాక్ బస్టర్ వచ్చింది. ఈ హిట్‌తో రణ్‌బీర్ కపూర్‌ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చాక్లెట్‌బాయ్‌తో 'ఆనిమల్' అనే సినిమా తీస్తున్నాడు. అలాగే ప్రభాస్‌తో 'స్పిరిట్' అనే సినిమా అనౌన్స్ చేశాడు. 'జెర్సీ' సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. సెకండ్ మూవీతోనే నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఈ స్టార్ మూడో సినిమాతో బాలీవుడ్‌కి వెళ్లాడు. షాహిద్ కపూర్‌తో 'జెర్సీ' రీమేక్ చేశాడు. పోయినేడాది డిసెంబర్‌లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా థర్డ్ వేవ్‌తో వాయిదా పడింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్‌తో పాన్ ఇండియన్ మూవీ చేయబోతున్నాడు గౌతమ్.