పునీత్ మూవీ పై ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

Divya
ప్రభాస్ చూడడానికి చాలా రఫ్ గా కనిపించినప్పటికీ తన మనసు మాత్రం చాలా సున్నితమని అభిమానులు అంటూ ఉంటారు. ఇక ప్రభాస్ సినిమాలు మాత్రమే కాకుండా ఆయనకు ఉన్న వ్యక్తిత్వమే అభిమానుల సంఖ్య పెరగడానికి కారణం అవుతుందని చెప్పవచ్చు. తన ఎదురుగా ఎవరైనా సరే కష్టపడుతున్న ప్రభాస్ దాన్ని చూసి తట్టుకోలేడని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాధాకృష్ణ తెలియజేయడం జరిగింది. ప్రభాస్ తనతో ఉన్న వారిని సమానంగా చూస్తారు అని తెలియజేశారు ఆయన.


ఇక భారతదేశంలో ప్రభాస్ కు ఉన్న  స్టార్డమ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సెట్లో ఉన్నారంటే చాలు ఆ సెట్ అంతా సందడి సందడిగా ఉంటుంది. ఇక సెట్ లో ఉండే ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటడట. ఇక ఆయనతో పనిచేసిన చిత్ర బృందం ఈ విషయాలను తెలియజేస్తూ ఉంటారు. తనకి స్నేహితులైన వారు ఎవరైనా దూరం అయ్యారు అంటే తట్టుకోలేడట  ప్రభాస్. ఇక ఎంతో మందికి కొన్ని కోట్ల రూపాయలు సహాయంగా అందించాడు ప్రభాస్. అయితే ఇటీవల పునీత్ రాజ్ కుమార్  సినిమాకి సంబంధించి టీజర్  విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఈ టీజర్ ను చూసి ప్రభాస్ ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది. పునీత్ మరణించడానికి ముందు చేసిన సినిమా జేమ్స్.. ఈ సినిమాలో పునిత్ క్యారెక్టర్ కు తన సోదరుడు శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పారట. ఇక ఈ సినిమా వచ్చేనెల 17వ తేదీన విడుదల అవబోతుంది. దీంతో హీరో ప్రభాస్ పునీతుడు సంబంధించి ఒక పోస్టర్ ను ఎమోషనల్ తో నింపేశాడు. జేమ్స్ రూపంలో ఒక అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నామని తెలియజేశాడు. పునిత్ సార్ ని అభిమానించే ఎంతోమంది అభిమానులు ఈ సినిమా ఒక ప్రత్యేకమని తెలియజేశాడు. ఇక తనని ఎంతో మిస్ అవుతున్నాను అన్నట్లుగా తెలియజేశాడు ప్రభాస్. ప్రభాస్ షేర్ చేసిన ఈ పోస్టు తెగ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: