తన సినిమా మీద తనకు నమ్మకం ఉంటుందంటున్న డీజే టిల్లు..!!
ఇక డీజే టిల్లు సినిమాలో తనతో పాటు నటించిన అమ్మాయి పేరు స్నేహ శెట్టి.. అయితే ఆమె కొన్ని అనివార్య కారణాలవల్ల ఇక్కడికి రాలేదు. ఆమె ఇక్కడికి రాకపోవడం వల్ల మా టీం చాలా ఎనర్జీ ని కోల్పోతుంది అంత తెలియజేశాడు.. ఈ మధ్య నేను కొన్ని కొత్త మాటలు వింటున్నా.. అవేమిటంటే బుకింగ్స్, థియేట్రికల్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ అని మాటలు విన్నాను.. ఈ మాటలను అడిగితే ఇవి నీకు అర్థమై చావదు అని అంటున్నారని తెలియజేశారు.
గుంటూరు టాకీస్ సినిమా తర్వాత తను చాలా బ్రేక్ తీసుకున్నాను ఆ తర్వాత థియేటర్లో విడుదల అవుతున్న సినిమా ఇదే అని తెలియజేశాడు.. నా చుట్టూ ఈ సినిమా గురించి ఒక బజ్ ఉంది.. అంతకు మించి ఎనర్జీ ఉంది.. మొత్తానికి అయితే ఈ సినిమా నడుస్తుందని తెలియజేశాడు. సితార వంటి బ్యానర్లో ఈ సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది.. సితార బ్యానర్ వంశి గారు కాస్త కోపంగా కనిపించినప్పటికీ.. ఆయన అడిగినవన్నీ ఇస్తూ ఉంటారు అని తెలియజేశారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా థ్రిల్ క్రేజీగా ఉంది అని తెలియజేశారు.