హరిహర గ్రాఫిక్స్ వల్లే లేట్.. వేరే లెవెల్!!

P.Nishanth Kumar
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నగా ఎప్పుడైతే ఈ చిత్రం అధికారికంగా ప్రకటించబడిందో అప్పటినుంచి ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎంటర్టైనర్ , ప్రేమ కథా చిత్రాలలో మాత్రమే నటించాడు. ఎప్పుడూ కూడా ఇలాంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాల్లో నటించలేదు.

ఈ నేపథ్యంలో తొలిసారి ఆయన ఈ విధమైన సినిమాలలో నటించడం పట్ల అందరూ ఎంతో ఆసక్తి కలిగింది. పవన్ సినిమా ఎలా ఉండబోతుందో అని అందరిలోనూ అంచనాలు కలిగాయి. అలా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.  తాజాగా దీనికి సంబంధించిన ఓ విషయం బయటకు లీక్ అయ్యింది. ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఎంతో అద్భుతంగా వచ్చాయని తప్పకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఈ సినిమా చేయబోతున్నానని వారు చెబుతున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ చిత్రం మార్చి లో విడుదల కాబోతున్నగా ఈ హరిహర వీరమల్లు సినిమా ఏప్రిల్ లో విడుదల కాబోతున్న డం విశేషం. పవన్ కళ్యాణ్ లాంటి భారీ స్థాయి ఇమేజ్ కలిగి ఉన్న హీరో సినిమాలు ఒకటే నెల వ్యవధిలో విడుదల కావడం నిజంగా పెద్ద విశేషం అనే చెప్పాలి. ఆ తరువాత భవదీయుడు భగవద్గీత సినిమాను అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే సినిమాకు ఆయన చేయబోతున్నాడు. మరి వచ్చే ఎన్నికల లోపు వీలైనన్ని సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాలని ఉద్దేశంతో పవన్ చేస్తున్న ఈ వెరైటీ ప్రయత్నాలు ఆయనకు ఎంతటి స్థాయికి క్రేజ్ ను తీసుకు వస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: