పూరీ, సుకుమార్ లలా.. త్రివిక్రమ్ కాకూడదు అంటే..!!
అతడు సినిమా తో వీరి కాంబో మొదలైంది. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. రెండో అవకాశం ఇస్తే ఖలేజా చేసే దాన్ని కూడా ఫ్లాప్ చేశాడు త్రివిక్రమ్ . అందుకే కాబోలు వీరి కాంబో మూడో సినిమా చాలా లేట్ అయ్యింది. ఒక దశలో వీరి కాంబో లో సినిమా వస్తుందో రాదో అనుకున్నారు. అయితే చివరికి మహేష్ కు ఎం చెప్పి ఒప్పించాడో తెలీదు కానీ మహేష్ 28 వ సినిమా ను మాత్రం త్రివిక్రమ్ చేస్తున్నాడు. మరి వారి లా త్రివిక్రమ్ బ్లాక్ లిస్టు లోకి వెళ్ళకూడదు అంటే హిట్ కొట్టాల్సిందే. ఇక పూజ హెగ్డే కథానాయిక గా నటిస్తున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.
ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక గా నటిస్తుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మే లో విడుదల అవుతుండగా ఈ ఫిబ్రవరి 14 న ఓ పాట విడుదల అవుతుంది. ఈ చిత్రం షూటింగ్ దాదాపు గా పూర్తి అవుతుండడం తో త్వరలోనే త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ కానున్నాడు ఈ హీరో. ఇక రాజమౌళి దర్శకత్వంలో కూడా మహేష్ ఓ సినిమా చేయబోతున్నాడు. తొందరలోనే ఈ సినిమా కు సంబందించిన అధికారిక ప్రకటన వస్తుంది. మరి మహేష్ ఈ రెండు సినిమాలతో ఎంతటి స్థాయి క్రేజ్ అందుకుంటాడా చూడాలి.