ఒక సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఆ చిత్రం కి సంబంధించిన కొన్ని అప్డేట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆసక్తి పరుస్తూ ఉండాలి. అప్పుడే సదరు సినిమాపై క్రేజ్ బాగా పెరిగి ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి కలిగి థియేటర్లకు వెళ్లి వారు ఆ చిత్రాన్ని వీక్షిస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తే తప్పకుండా వారు ఈ సినిమాను మళ్ళీ మళ్ళీ చూస్తారు. ఆ విధంగా రవితేజ హీరోగా నటించిన కిలాడి సినిమా యొక్క అప్డేట్లు ఇప్పుడు రవితేజ అభిమానులను నిరాశపరుస్తుంది.
క్రాక్ వంటి సినిమాతో భారీ స్థాయి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రవితేజ తన తదుపరి సినిమా రమేష్ వర్మ అనే దర్శకుడితో చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. గతంలో ఆయనతో వీర సినిమా అనే చేయగా అది భారీ స్థాయిలో డిజాస్టర్ అయ్యింది దాంతో ఈ దర్శకుడు చాలా డీలా పడిపోయాడు. ఇప్పుడు రవితేజతో కలిసి ఆయన ఇంత గొప్ప సినిమా చేస్తుండడం విశేషం.మధ్య లో చిన్న చిన్న ప్రయత్నాలు చేసిన అయన రవితేజ నమ్మకాన్ని ఏర్పరుచుకున్నాడు.
తాజాగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ యూ ట్యూబ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కొన్ని డైలాగులు ఎంతో ఆసక్తికరంగా కనిపించిన కూడా కొన్ని ప్రేక్షకులు నమ్మే విధంగా లేవు అంతే కాదు ఈ చిత్రం హైలెట్ అవ్వడం కోసం ఇందులో ఒక లిప్ లాక్ కూడా పెట్టడం గమనార్హం. ఈ విధమైన ప్రత్యేక ఆకర్షణలు ఏ సినిమాలోనైనా ఉన్నాయి అంటే తప్పకుండా ఆ చిత్రం ఏదో అవుతుందన్న సంకేతాలను పంపిస్తుంది. మరి ఇప్పుడు చేస్తున్న ఈ ఎనాలసిస్ తలకిందులు చేయాలంటే నిజంగా ఎంతో అదృష్టం ఉండాలి. ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ ద్విపాత్రాభినయం చేయబోతోంది అని అంటున్నారు. మరి గతంలో ఎప్పుడు ఇలాంటి పాత్ర ను చేయని ఈమె ఇప్పుడు ఎలా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.