అది ప్రభాస్ అభిమానులను బాగానే నిరాశ పరుస్తోంది!!

P.Nishanth Kumar
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా అయ్యింది. దాంతో మార్చి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ టాలీవుడ్ లో జరుగుతుంది.

ఈ సినిమా యొక్క హిందీ వర్షన్ రన్ టైం కేవలం రెండున్నర గంటలు మాత్రమే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా చిత్రం యొక్క రన్ టైం ఇంత తక్కువగా ఉండడం అంటే నిజంగా అభిమానులను భారీ స్థాయిలో నిరాశ పరిచే విషయం అని చెప్పాలి. ఈ మధ్య చిన్న హీరోల సినిమాలు మూడు గంటలు ఉంటున్న నేపథ్యంలో ఇంత పెద్ద సినిమా రెండున్నర గంటల రన్ టైం ఉండటం అనేది ప్రభాస్ అభిమానులను భారీస్థాయిలో నిరాశ కలిగిస్తుంది.

ఇంకోవైపు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మూవీ 3 గంటల రన్ టైం ఉందని సమాచారం రావడంతో ఈ సినిమా దర్శకుడి పై ప్రభాస్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. అయితే దర్శకుడి వెర్షన్ లో వేరే ఆలోచన ఉంది. మొదటనుంచి ఈ కథను స్వీట్ గా ఉంచడానికి ఆయన ప్రయత్నాలు చేశాడు. అందుకే ఇంత తక్కువ టైం పెట్టారని ఆయన తరపు వారు చెబుతున్నారు. ఏదేమైనా ట్రైలర్ తర్వాత ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని ప్రభాస్ కు తెచ్చి పెడుతుందో చూడాలి. సాహో తర్వాత ప్రభాస్ నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో ఆయనను వెండితెరపై చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: