టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలు విడుదలవడం జరుగుతుంది. కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా వాయిదా పడ్డ సినిమాలు అన్నీ ఇప్పుడు విడుదల అవడానికి సిద్ధం అవుతున్నాయి. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అనే తేడా లేకుండా మంచి విడుదల తేదీలను ఎంచుకుంటూ తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళ హీరోలు సైతం తెలుగులో సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ విధంగా తెలుగులో ప్రేక్షకులను అలరించబోతున్న తమిళ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అజిత్ హీరోగా నటించిన వాలిమై చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. తెలుగు యువ హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులలో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరించడం తో ఆయనకు ఇక్కడ భారీ స్థాయిలో అభిమానం పెరిగింది. ఇక సూర్య గత చిత్రాలు భారీ హిట్ లు కావడం అవి తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మరొక యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఈటీ అనే సినిమా తో ప్రేక్షకులను అలరించడానికి ఏప్రిల్ లో రాబోతున్నాడు అని తెలుస్తుంది.
విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న బీస్ట్ సినిమా కూడా వచ్చే నెలలో విడుదల కావడానికి సిద్దమవుతోంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక అపరిచితుడు సినిమాలో తెలుగు లో భారీ స్థాయిలో మార్కెట్ ను ఏర్పరుచుకుని వరుసగా తన సినిమాల్ని విడుదల చేస్తూ వస్తున్న విక్రమ్ మరియు ఆయన కుమారుడు హీరోలుగా నటించిన చిత్రం కూడా తెలుగులో విడుదల అవడానికి సిద్ధం అవుతుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలను ఏర్పరుచుకున్నారు. వచ్చే వారమే ఈ సినిమా విడుదల కాబోతున్నడం విశేషం.