ఫ్యామిలీ హీరోయిన్ మీరా జాస్మిన్.. హాట్ ఫోటోలు చూశారా?

praveen
ఇటీవలి కాలంలో అవకాశాల కోసం హీరోయిన్లు అందాల ఆరబోత అనే ఆయుధాన్ని వాడుతున్నారు ఇలా గ్లామర్ షో ద్వారా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్లు కూడా లేకపోలేదు నేటి రోజుల్లో.. అయితే కొంతమంది సీనియర్ హీరోయిన్లు సైతం ఇప్పుడు హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నారు. ఒకప్పుడు ఫామిలీ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగింది మీరా జాస్మిన్. చీరకట్టులో ఎంతో హుందాగా కనిపించింది. గ్లామర్ పాత్రలు దాదాపు చేయలేదు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో కనుమరుగయ్యింది.


 కానీ ఇప్పుడు 39 ఏళ్ల వయస్సులో మాత్రం గ్లామర్ డోసు పెంచి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది మీరాజాస్మిన్. ఇటీవలే ఒక ఫోటో షూట్ చేయగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి.. మొన్నటి వరకూ ఫ్యామిలీ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న మీరాజాస్మిన్ ఇక ఇప్పుడు మాత్రం గ్లామర్ షో చేయడానికి రెడీ అయింది అన్న దానికి ఇక ఈ ఫోటోలు సంకేతం గా మారిపోతున్నాయి.. ఇక ఈ ఫోటో షూట్ వెనుక కథ ఏంటి అన్న దానిపై చర్చ జరుగుతూ ఉండగా.. సినిమా అవకాశాల కోసమే మీరాజాస్మిన్ ఇలాంటి ఫోటో షూట్ చేసింది అని కొంత మంది ప్రేక్షకులు అనుకుంటున్నారు.


 2014లో పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయిన మీరాజాస్మిన్ ఇక ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ప్రస్తుతం మకల్ అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది.. ఏదేమైనా ఒకప్పుడు డీసెంట్ పాత్రలతో ఫ్యామిలీ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న మీరాజాస్మిన్ ఇక ఇప్పుడు హాట్ హాట్ ఫోజులు తో సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం తో అభిమానులు అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఇక మీరా జాస్మిన్ కు సెకండ్ ఇన్నింగ్స్ కలిసి రావాలని ఆయన అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు అని చెప్పాలి. ఇక ఈ అమ్మడు మళ్లీ సినిమాల పై ఫోకస్ పెట్టడానికి ఆర్థికఇబ్బందులు కారణం  అంటూ టాక్ కూడా ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: