వేణు ఐకాన్ హోప్స్ ఇంకా వదులుకోలేదా!!

P.Nishanth Kumar
అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా ఉందో లేదో కానీ పలుమార్లు ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తుంది. గతంలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసిన చిత్ర బృందం షూటింగ్ జరుపుకోవడంతో ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ పక్కన పెట్టేసాడు అని అందరూ అనుకున్నారు. వాస్తవానికి అల్లుఅర్జున్ ప్రస్తుతం చేస్తున్న పుష్ప చిత్రాన్ని కంటే ముందు ఈ సినిమాకు చేయాల్సి ఉంది కానీ వేణు శ్రీరామ్ దురదృష్టం కొద్దీ మహేష్ సుకుమార్ సినిమా క్యాన్సిల్ బన్నీ తో సినిమా చేయడం జరుగుతుంది.

అయితే పుష్ప సినిమా తర్వాత తనకు అవకాశం ఇస్తానని అల్లు అర్జున్ మాట ఇవ్వడం వల్లనే ఇప్పటివరకు ఈ దర్శకుడు నమ్మకం కోల్పోకుండా ఎదురుచూస్తున్నాడు. మధ్యలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి దాన్ని విడుదల చేసి ఘన విజయం అందుకొన్నాడు. అయినా కూడా ఈ దర్శకుడిపై అల్లు అర్జున్ కి ఎందుకు నమ్మకం కుదరడం లేదు తెలియదు కానీ ఆయనతో సినిమా ఎటూ తేల్చకుండా అందరికీ విసుగు పుట్టిస్తున్నాడు. ఒకానొక దశలో ఐకాన్ సినిమా లేదనే ప్రతి ఒక్కరు కూడా భావించారు.

కానీ వేణు శ్రీరామ్ మాత్రం ఈ చిత్రంపై ఏమాత్రం హోప్స్ కొల్పోకుండా అల్లు అర్జున్ ఆ విధంగా కథను తయారు చేస్తున్నాడట. ఇటీవలే అల్లుఅర్జున్ తన తదుపరి సినిమా గురించి తర్జనభర్జనలు పడుతున్న నేపథ్యంలో ఈ దర్శకుడు ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ నేరేషన్ అవడంతో ఆయనతో సినిమా చేసే విధంగా అల్లుఅర్జున్ ముందుకు పోతున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు ఎలా ఏ విధంగా అధికారిక ప్రకటన వస్తుందో ఇంకా తెలియరాలేదు. అంత పెద్ద సూపర్ హిట్ సినిమా చేసినా కూడా ఈ దర్శకుడికి తదుపరి సినిమా ఓకే చేసుకోవడం పట్ల ఇంతటి ప్రాబ్లం ఏర్పడడం నిజంగా ఆశ్చర్యకరమే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: