మందుకు బానిసలైన హీరోయిన్లు ఏమంటున్నారో తెలుసా..?

NAGARJUNA NAKKA
మనీషా కోయిరాల అయితే తన ఆత్మకథ 'హీల్డ్‌- హౌ కేన్సర్ గేవ్‌ మి ఏ న్యూ లైఫ్‌'లో మందుకి అడిక్ట్ కావొద్దని పేజీల కొద్దీ రాసుకొచ్చింది. బాధని మరిచిపోవడానికి మందు తాగాలి అనుకుంటారు గానీ, మితిమీరితే మందే అన్ని బాధలకి కారణమవుతుందని చెప్పుకొచ్చింది. అంతేకాదు మందుకి దూరమయ్యాక తన జీవితం  చాలా కొత్తగా ఉందంటోంది. శ్రుతీ హాసన్ స్టార్‌ రేసులో దూసుకెళ్తోన్న సమయంలో ఒక్కసారిగా సినిమాలకి దూరమైంది. 'కాటమరాయుడు' తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుంది. మరి శ్రుతి ఇంత గ్యాప్ తీసుకోవడానికి ఆల్కాహాలే కారణమని తెలుస్తోంది. బ్రేకప్‌తో ఆల్కాహాల్‌కి అడిక్ట్ అయిన శ్రుతి, ఈ వ్యసనానికి దూరమయ్యాకే మళ్లీ బిజీ అయిందని సమాచారం. 'క్రాక్‌'తో రీఎంట్రీ ఇచ్చిన శ్రుతి ప్రభాస్‌తో 'సలార్‌' చేస్తోంది.

పూజా భట్ కెరీర్‌లో యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా చాలా రోల్స్‌ ప్లే చేసింది. అడుగుపెట్టిన ప్రతీ చోట సక్సెస్ అందుకుంది. అయితే ఇంత సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌లో ఒక పొరపాటు కూడా చేశానని ఇప్పటికీ బాధపడుతుంది పూజా భట్. భయాలని కప్పిపుచ్చుకోవడానికి పూజ మందుకి దగ్గరైందట. దీంతో చాలా ప్రాబ్లమ్స్‌ వచ్చాయట. అయితే తండ్రి మహేశ్‌ భట్‌తో మాట్లాడాక పూర్తిగా మందు మానేసిందట పూజ. 2017 నుంచి మళ్లీ మందు ముట్టుకోలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది పూజ.
ఇక రణ్‌బీర్ కపూర్‌కి యూత్‌లో బోల్డంత పాపులారిటీ ఉంది. ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ హీరోకి విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పొచ్చు. అయితే ఈ క్రేజీ స్టార్‌కి బోల్డన్ని చెడు అలవాట్లు కూడా ఉన్నాయట. ఒక ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌ కాలేజ్‌టైమ్‌లో డ్రగ్స్‌ తీసుకున్నానని చెప్పాడు. తర్వాత హెల్త్‌కి మంచిదికాదని డ్రగ్స్‌ మానేసినా, సిగరెట్‌ని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నానని అంటారు రణ్‌బీర్.

కంప్లీట్‌ కమర్షియల్ స్టోరీలా కనిపించే హీరో సంజయ్‌ దత్. డ్రగ్స్, ఆల్కహాల్‌తో చాలా కాలం సావాసం చేసి, తండ్రి సునీల్‌ దత్‌ సాయంతో బయటపడిన స్టార్ సంజయ్. 'సంజు' సినిమాలో చూపించిన కొన్ని ఎపిసోడ్స్‌లో నిజాలు దాచారని చాలా విమర్శలొచ్చాయి గానీ, ఆల్కాహాల్, డ్రగ్స్‌ మేటర్‌లో ఎవరూ తప్పని చెప్పలేదు. అయితే అంతలా అడిక్ట్ అయిన సంజు నాన్న సాయంతో అమెరికన్ రిహాబిలేషన్‌ సెంటర్‌లో జాయిన్ అయ్యాడు. డ్రగ్స్ నుంచి బయటపడి మళ్లీ కెరీర్‌ స్టార్ట్ చేశాడు.

'షోలో' సినిమా టైమ్‌లో అమితాబ్‌ బచ్చన్‌కి ఎంత పేరు వచ్చిందో, ధర్మేంద్రకి అంతకంటే ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇలాంటి హీరో బిగ్‌బీ రేంజ్‌లో నిలబడలేకపోవడానికి ఆల్కాహాల్ ఓ కారణమని చెప్తారు. ధర్మేంద్ర కూడా 'యమ్లా పగ్లా దీవానా' రిలీజ్‌ టైమ్‌లో మందు వల్ల కెరీర్‌ నాశనమైపోయిందని బాధపడ్డాడు. అయితే 15 ఏళ్లు వెంటాడిన ఈ అడిక్షన్‌ నుంచి బయటపడ్డానికి కథలు రాయడం మొదలుపెట్టానని, మెల్లగా మందుకు దూరమయ్యానని చెప్పాడు ధర్మేంద్ర.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: