సమంత స్పీడ్ మామూలుగా లేదుగా..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ సమంత గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ ముద్దుగుమ్మ నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు సమంత అందచందాలకు, నటనకు టాలీవుడ్ ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో సమంత కు టాలీవుడ్ లో మంచి సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది.

 సమంత కేవలం తెలుగు భాష సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది, ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే సమంత, అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్ళాడింది, అయితే కొన్ని రోజుల క్రితమే వీరిద్దరికీ విడాకులు అయ్యాయి. అయితే నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన సినిమాల స్పీడ్ ను మరింత పెంచింది, ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్న సమంత మరి కొన్ని సినిమాలను కూడా లైన్ లో పెడుతోంది. ఇప్పటికే శాకుంతలం సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన సమంత 'యశోద' సినిమా షూటింగ్ ను కూడా శరవేగంగా పూర్తి చేస్తుంది, ఈ సినిమాలతో పాటు సమంత ఒక హాలీవుడ్ సినిమాలో కూడా నటించబోతుంది. అలాగే పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో కూడా సమంత నటించబోతున్నట్లు తెలుస్తోంది, అయితే ఈ సినిమాలతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా సమంతకు పేజీ సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది, కార్తీ హీరోగా సతీష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం సమంతను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి, మరి ఈ వార్తపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: