పవన్ కళ్యాణ్ ఆ తప్పు చేయడం మానడా!!
కానీ ఇద్దరికీ కుదరక సినిమా చేయలేదు ఇప్పుడు భవదీయుడు భగవద్గీత అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ పోన్ అవుతుందనే వార్తలు రావడం వీరి కలయికలో సినిమా రావాలని ఆశ పడుతున్న అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం చేస్తున్న భీమ్లా నాయక్ సినిమా పూర్తి అయిన తర్వాత హరిహర సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం తొందరగా విడుదల చేయలనే క్రమంలో హరిహర వీరమల్లు కోసం భవదీయుడు భగవద్గీత డేట్స్ ను వాడేస్తున్నాడట పవన్ కళ్యాణ్.
దీంతో ఈ కాంబినేషన్ లో సినిమా చూడాలనుకునే వారు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొన్ని విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు తన రాజకీయ కెరీర్ కోసం సినిమా లైఫ్ ను పనం గా పెట్టడం కూడా వారికి ఏమాత్రం నచ్చడం లేదు. ఇప్పుడు చేస్తున్న సినిమాలు లేట్ రావడానికి కారణం ఆయన తన డేట్స్ ను తన పొలిటికల్ సభల కోసం కేటాయించిన వాటికి ఉపయోగించడమే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ తప్పు దేనికి దారి తీస్తుందో తెలియదు కానీ అభిమానులు మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొంది. సినిమాలను విడుదల చేస్తే ప్రేక్షకులు ఆనందం పొందుతారు అనే విషయాన్ని పక్కన పెడితే ఆ తరువాత సినిమాలు చేస్తారా లేదా అన్న భయం వారిలో ఎక్కువ అయింది అని చెప్పవచ్చు.