ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లో.. ఆక్వామ్యాన్?
ఇక ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లో ఉండే అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులందరినీ ఫిదా చేసేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ పదవ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక దీని కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇక ఇలాంటి సమయంలోనే ఇప్పుడు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10 నుంచి ఒక కేజీ అప్ డేట్ బయటికి వచ్చి వైరల్ గా మారిపోయింది.
దాదాపు సినీ ప్రేక్షకులు అందరూ ఆక్వా మ్యాన్ సినిమా చూసే ఉంటారు. ఈ సినిమాతో హీరోగా జాషన్ మెమోవా ఎంతగానో క్రేజ్ సంపాదించాడు. అయితే ఆక్వా మ్యాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన జాసన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10 లో విలన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2023 మే 19వ తేదీన యూనివర్సల్ గా ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10 ఆక్వా మాన్ పాత్ర ఎలా ఉండబోతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.