విడాకుల పై స్పందించిన హిమజ.. ఏమందో తెలుసా?
ఇటీవల ఎంతో మంది సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నట్లు గాని హిమజ కూడా మరికొన్ని రోజుల్లో తన భర్తతో విడిపోతుందని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. అయితే ఈ వార్త చూసిన తర్వాత అభిమానులు పూర్తిగా కన్ఫ్యూజన్లో పడిపోయారు. అసలు ఎవరికీ తెలియకుండా హిమజ కు పెళ్లి ఎప్పుడూ అయింది అని కొంత మంది డౌట్ పడుతూ ఉంటే.. సరే ఎవరికి తెలియకుండా పెళ్లి అయితే అయింది కానీ మళ్లీ విడాకులు ఎందుకు తీసుకుంటుంది అని మరికొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏదేమైనా విడాకుల వార్తలతో హిమజా ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే తన గురించి వస్తున్న వార్తలపై స్పందించిన హిమజ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు లింక్స్ ఆర్థికల్స్ నా స్నేహితులు పంపించారు. నేను ఎవరినో పెళ్లి చేసుకున్నానని.. విడాకులు కూడా తీసుకోబోతున్నా అంటూ అందులో ఉంది. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే.. నా పెళ్ళికి నా విడాకులకి నన్ను పిలిస్తే బాగుంటుంది. యూట్యూబ్ లో పెళ్లిళ్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో విడాకులు ఇచ్చేస్తున్నారు. ఇలాంటి ట్రోలింగ్ నేను అసలు పట్టించుకోను.. కానీ పెద్ద వాళ్ళు ఫీలవుతారు కదా. అందుకే ఇలాంటి వార్తలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టండి అంటూ హిమజా ఒక వీడియో విడుదల చేసి అందరికీ ఒక క్లారిటీ ఇచ్చింది.