సినిమా సెలబ్రిటీలకు కారవాన్ ఎంత స్పెషల్ లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే షూటింగ్ సమయంలో కానీ షూటింగ్ టైంలో రెడీ అవడానికి సెలబ్రిటీలు కారవాన్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే చాలామంది సెలబ్రిటీలకు నిర్మాతలే స్వయంగా కారవాన్ ప్రొవైడ్ చేస్తుంటారు. కానీ కొంత మంది స్టార్ సెలబ్రిటీలు మాత్రం సొంతంగా డిజైన్ చేయించుకుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలకు ఇప్పుడు సొంతంగా కారవాన్లు ఉన్నాయి. అయితే ఈ కారవాన్లను స్పెషల్ గా వాళ్లకి కావాల్సినట్టుగా ఎంతో లగ్జరీగా తయారు చేయించుకున్నారు. వాటి ధర కూడా కోట్లలోనే ఉంటుంది.
అయితే ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లో చేరిపోయారు సీనియర్ నటుడు నరేష్మ్. నరేష్ కూడా ఇప్పుడు ఓ లగ్జరీ కారవాన్ ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు ఈ సీనియర్ హీరో. ప్రస్తుతం ఈయన చేతినిండా సినిమాలు ఉన్నాయి. అందుకే ఇంట్లో కంటే ఎక్కువ సమయం కారవాన్ లోనే గడుపుతున్నాడట. ఇక ప్రస్తుతం ఉన్న కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇతర నటీనటులు వాడిన కారవాన్లని వాడడం మంచిది కాదని.. ప్రత్యేకంగా ఓ వ్యాన్ ని కొనుగోలు చేశాడట నరేష్. దాన్ని తన అభిరుచులకు తగ్గట్లుగా డిజైన్ చేసుకున్నారట. అంతేకాదు ఈ స్పెషల్ కారవాన్ ని ఏకంగా ముంబై నుంచి తెప్పించారని తెలుస్తోంది.
ఇక ఈ కారవాన్లో ఏసీ, బెడ్, మేకప్ ప్లేస్, జిమ్, వెయిటింగ్ రూమ్, వాష్ రూమ్స్ ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా కారవాన్ గురించి నరేష్ మాట్లాడుతూ..' సినిమా నటీనటులకు కారవాన్ లు మరో ఇల్లు లాంటివి. నా జీవితంలో సుమారు 70 శాతం ఈ వాహనాల్లోనే గడిచిపోయింది. దాంతో కార్ల కోసం ఖర్చు పెట్టే బదులు అదే డబ్బుతో మంచి కార్లను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాను. నా అవసరాలు దృష్టిలో ఉంచుకొనే దీన్ని కొనుగోలు చేశాను' అంటూ నరేష్ స్వయంగా తెలిపారు...!!