హీరో విశాల్ తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ విశాల్ కు అభిమానులు ఉన్నారు. పందెంకోడి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విశాల్ తెలుగులో ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత విశాల్ నటించిన సెల్యూట్, పొగరు సినిమాలకు కూడా విశాల్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. నిజానికి హీరో విశాల్ తెలుగు వాడే కానీ ఆయన తండ్రి నిర్మాతగా తమిళ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. అలా విశాల్ కుటుంబం చెన్నైకి మఖం మార్చింది.
అయినప్పటికీ విశాల్ తెలుగు మూలాలు మర్చిపోలేదు. ఇప్పటికీ తన సినిమాలను తెలుగులో విడుదల చేస్తూ చక్కగా తెలుగు మాట్లాడుతాడు. కెరీర్ లో కొన్ని హిట్లు పడినప్పటికీ స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు. వరుస పెట్టి భారీ బడ్జెట్ లో సినిమాలు చేసినప్పటికీ అవి ఫ్లాప్ అవడంతో గత కొన్ని నెలలుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. విశాల్ నటించిన మదగజరాజా సినిమా 12 ఏళ్ల క్రితం 2012లో షూటింగ్ పూర్తి చేసుకోగా త్వరలో విడుదల కాబోతుంది.
ఈ సినిమాలో అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించగా.. బిచ్చగాడు సినిమా హీరో విజయ్ ఆంటోనీ ముఖ్యమైన పాత్రలో నటించారు. భారీ తారాగణం నటించిన ఈ సినిమా ఎందుకు విడుదల కాలేదు. కానీ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ఈ సినిమా అయినా హిట్ అవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో విశాల్ షాకింగ్ లుక్ లో కనిపించాడు. చూడ్డానికి చాలా సన్నబడి చేతులు వణుకుతూ కనిపించారు. వేదిక వద్దకు వచ్చేటప్పుడు సరిగ్గా నడవలేకపోయారు కూడా. ఈ క్రమంలో ఆయనను పలువురు పరామర్శించడం కనిపిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా ఆయన జ్వరం జలుబుతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక విశాల్ అలాంటి లుక్ లో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.