టాలీవుడ్ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటీ మణులు ఎంతో మంది ఉన్నారు . అలా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రాసి కన్నా ఒకరు . ఈమె ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది . ఈ మూవీ మంచి విజయం అందుకోవడంతో ఈమెకు ఈ సినిమా తో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది . ఆ తర్వాత ఈ బ్యూటీ కి టాలీవుడ్ లో వరుస పెట్టి అవకాశాలు దక్కడం మొదలు అయింది.
ఇకపోతే ఈ మధ్య కాలంలో రాసి కన్నా ఎక్కువ శాతం తెలుగు సినిమాలు చేయడం లేదు. ఈమె తెలుగు సినిమాలో నటించి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న తెలుసు కదా అనే సినిమాలో మాత్రమే హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎక్కువ శాతం తమిళ , హిందీ సినిమాల్లో నటించడానికి ఆసక్తిని చూపిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఈమెకి సినిమా అవకాశాలు తగ్గినా కూడా అందాలతో మాత్రం ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంటుంది.
సినిమాల్లో వీలు చెప్పినప్పుడల్లా తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉండే ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తోంది. ఇలా ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తన అందాలను ఆరబోస్తూ వస్తుంది.