'వెంకీ సంక్రాంతికి వస్తున్నాం ' కు ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా?
ఇప్పటికే ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. రెండిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. 18 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్, రమణ గోగుల కాంబో మళ్లీ వస్తోంది. బ్లాక్‌బస్టర్ లక్ష్మి కోసం వెంకటేష్‌తో కలిసి పని చేసిన రమణ గోగుల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్‌కి తన వాయిస్ ని అందించారు. అయితే వెంకీ మామ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా స్టోరీ లైన్ కూడా ఇటీవల లీక్ అయింది.
ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్ లు కనిపిస్తున్నారు. అయితే అందులోనూ ముఖ్యంగా సీనియర్ హీరోల సినిమాల్లోనే ఎక్కువగా ఉన్నారు. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్ లు నటిస్తున్నారు. ఇక ఇప్పటికే వెంకీ మామ నటించిన సూర్యవంశం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సుందర కాండ ఇలా కొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్ లు ఉన్నారు. ఇలా విక్టరీ వెంకటేష్ ఇద్దరు హీరోయిన్ లతో తెరకెక్కించిన సినిమాలు అన్నీ హిట్ కొట్టాయి. దీంతో ఆ సెంటిమెంట్ ఈ సారి కూడా కలిసొస్తుందా? అని ప్రేక్షకులు చర్చలు జరుపుతున్నారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అందుకుంటుందో లేదో చూద్దాం.