మళ్లీ హాస్పటల్ లో చేరిన సమంతా.. ఆందోళనలో ఫ్యాన్స్
ఆ పోస్ట్ చూసిన సామ్ అభిమానులు, శ్రేయోభిలాషులు విషాదంలో మునిగిపోయారు. అలా సామ్ ని హాస్పటల్ లో చూసిన అందరూ ఆందోళన చెందుతున్నారు. సామ్ త్వరగా కొలుకోవాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు. తన గురించి సోషల్ మీడియాలో సామ్ రెస్పెక్ట్ బటన్ అంటూ చాలానే అకౌంట్స్ క్రియేట్ చేసి పోస్టులు పెడుతున్నారు. ఇక ఇటీవలే సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూసిన విషయం తెలిసిందే. నటి సమంత తన తండ్రి మరణాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులకు తెలియజేసింది. తన ఎదుగుదలకు కారణం జోసెఫ్ ప్రభు అని చెప్పుకొచ్చారు. అలాగే సమంత జీవిత ప్రయాణంలో ఆయన అందించిన మద్దతు గురించి కూడా తరచూ సామ్ ప్రస్తావిస్తూ ఉండేవారు.
అయితే ఒకవైపు సామ్ ఆరోగ్య పరిస్తితి ఇలా ఉండగా.. మరోవైపు నాగ చైతన్య, శోభితా ధూళిపాళ తమిళనాడు కాంచీపురంలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో సందడి చేసిన ఫోటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చూసిన కొందరు సూపర్బ్ అంటూ పొగుడుతుంటే.. మరికొంత మంది సామ్ ఫ్యాన్స్ వెటకారంగా కామెంట్స్ పెడుతున్నారు. నటుడు అక్కినేని నాగచైతన్యకు మొదట సమంతతో పెళ్లి జరిగి విడాకులు తీసుకున్నారు. ఇటీవలే నాగ చైతన్య, శోభితా ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకొని డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం చేసుకున్నాడు.