సౌత్ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు అందం అభినయం వాక్చాతుర్యం ఇలా అన్నీ ఉన్నా కూడా కొంతమంది రాణించలేకపోతున్నారు. కానీ ఈ నటి మాత్రం చెవులు వినిపించకపోయినా.. మాటలు రాకపోయినా.. కూడా తన అద్భుతమైన నటనతో ఎంతోమందిని కట్టిపడేస్తుంది. ముఖ్యంగా చూపు తిప్పుకొని అందంతో ఉన్న ఈ ముద్దుగుమ్మ అసలు మూగ చెవిటిది అంటే ఎవరు కూడా నమ్మరు. ఇక ఇప్పటికే ఆ హీరోయిన్ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆమెనేనండి నటి అభినయ. తెలుగు,తమిళ సినిమాల్లో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ముఖ్యంగా స్టార్ హీరోలకు చెల్లెలు పాత్రలో నటిస్తూ ఇండస్ట్రీలో ఫేమస్ అయిపోయిన నటి అభినయ అంటే తెలియని వారు ఉండరు. అభినయ తెలుగులో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో వెంకీ మహేష్ బాబు లకు చెల్లెలు పాత్రలో నటించింది.
అలాగే దమ్ము మూవీలో కూడా ఎన్టీఆర్ కి సోదరి పాత్ర చేసింది. అలా తెలుగులో స్టార్ హీరోలకు సిస్టర్ రోల్స్ తో పాటు తమిళంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్గా మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అయితే చాలా రోజుల నుండి నటి అభినయ విశాల్ తో ప్రేమలో ఉందని ఎన్నో రూమర్లు వినిపించాయి.కానీ ఆ రూమర్లన్నీ పక్కనపెట్టి నేను 15 సంవత్సరాలుగా నా స్నేహితుడితో ప్రేమలో ఉన్నాను.చాలా రోజుల నుండి డేటింగ్ కూడా చేస్తున్నాను అంటూ నటి అభినయ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇక ఈ మధ్యనే గుడిగంటల కొడుతూ ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నాం అంటూ కూడా ఒక పోస్ట్ చేసింది.అయితే తాజాగా అభినయ తనకు కాబోయే భర్త ఎవరో సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది.
ఇక ఈ ఫొటోస్ చూసిన నెటజన్లు ఈడు జోడు బాగుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఇక అభినయ చేసుకోబోయే అబ్బాయి పేరు కార్తీక్.ఇక మరో విషయం ఏమిటంటే కార్తీక్ మన హైదరాబాద్ వాడే.ఆయన హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాడట. ఇక బిజినెస్ మాన్ ఫ్యామిలీ అయినటువంటి కార్తీక్ తన తండ్రికి సంబంధించిన ఎన్నో బిజినెస్ లను చూసుకుంటూ బిజినెస్ రంగంలో రాణిస్తున్నారట.దాదాపు 15 సంవత్సరాలుగా అభినయ కార్తీక్ లు ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఎట్టకేలకు అభినయ తన ప్రియుడిని పరిచయం చేయడంతో విశాల్ తో వస్తున్న పెళ్లి వార్తలకు చెక్ పడినట్లు అయింది. ఇక త్వరలోనే వీరి పెళ్లి కూడా జరగబోతున్నట్టు టాక్