టీవీ: టాలీవుడ్ యాంకర్ కి.. హీరో శ్రీకాంత్ కి ఉన్న రిలేషన్ ఏంటి..?

Divya
తెలుగు తెరపై వెండితెర, బుల్లితెర పైన ఎన్నో చిత్రాలు నటించి తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నది యాంకర్ అనిత చౌదరి. 16 సంవత్సరాలకే తన సినీ కెరీర్ ని మొదలుపెట్టినటువంటి అనితా చౌదరి ముఖ్యంగా జెమిని, ఈటీవీ, జీ తెలుగు వంటి చానల్స్ లో కూడా యాంకర్ గా కొనసాగించి మంచి క్రేజ్ అందుకున్నది. ఆ తర్వాత ఉన్న క్రేజ్ తో వెండి తెర పైన  గుర్తింపు సంపాదించుకోవాలని 1997లో నటుడు శ్రీకాంత్ హీరోగా నటించిన తాళి సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. అయినప్పటికీ యాంకర్ గా ఉండడం ఇష్టం ఉండడంతో సినిమా అవకాశాన్ని కూడా వదులుకున్నదట అనిత చౌదరి.

అయితే ఆ తర్వాత మళ్లీ హీరో వెంకటేష్ నటించిన రాజా చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. సుమారుగా 50 కి పైగా చిత్రాలలో కూడా నటించిందట అనిత.. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చిన అనిత..కరోనా సమయంలో ఆక్వా అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించిందట. అనిత చౌదరి కుటుంబం కూడా చాలా పెద్దది ఈమెకు ముగ్గురు అన్నయ్యలు ఒక అక్క కూడా ఉన్నదట. ఇంటి బాధ్యతలను కొన్నేళ్ల పాటు తీసుకున్నదట అనిత చౌదరి.

అనిత చౌదరి, శ్రీకాంత్ కు ఏమవుతుందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. శ్రీకాంత్ కు దగ్గర బంధువు అయినా కృష్ణ చైతన్య నను 2005లో ప్రేమించి మరి వివాహం చేసుకున్నది అనిత. వీరికి ఒక బాబు కూడా జన్మించారు. కృష్ణ చైతన్య తో అనిత చౌదరి పెళ్ళి హీరో శ్రీకాంత్ మరి చేయించినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ కు కృష్ణ చైతన్య కజిన్ అవుతారట.. అనిత చౌదరి కూడా దగ్గర బంధు అవ్వడం చేత వీరి పెళ్లి శ్రీకాంత్ సమక్షంలోని జరిగినట్లు ఒక ఇంటర్వ్యూలో అనిత చౌదరి వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: