ఆ బ్లాక్ బస్టర్ సినిమా వల్ల నేను చాలా ట్రోల్ అయ్యాను.. మీనాక్షి..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ బ్యూటీ ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి విజయం దక్కకపోయిన మంచి గుర్తింపు మాత్రం దక్కింది. ఆ తర్వాత ఈమె కిలాడి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా మీనాక్షి కి నిరాశనే మిగిల్చింది. కానీ ఈ మూవీలో మీనాక్షి అదిరిపోయే రేంజ్ అందాలను ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ నీ ఎక్కించింది.

ఈమెకు తెలుగులో మొట్ట మొదటి విజయం హిట్ ది సెకండ్ కేస్ అనే సినిమా ద్వారా దక్కింది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈమె తమిళ నటుడు తలపతి విజయ్ హీరో గా రూపొందిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈమె వరస పెట్టి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ను కొనసాగిస్తుంది. తాజాగా మీనాక్షి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమె కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా మీనాక్షి మాట్లాడుతూ ... నేను కొంత కాలం క్రితం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించాను.

ఆ మూవీ వాళ్ళ నేను చాలా ట్రోల్ అయ్యాను. ఇక కొంత కాలం క్రితమే నేను లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించాను. ఆ మూవీ వల్ల నాకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఇకపోతే తాజాగా ఈమె విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలు ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: