పెళ్లి సందడి సినిమా బాగానే వర్క్ ఔట్ అయ్యింది!!
పెళ్లి సందడి సినిమా కు ముందు రోషన్ నిర్మల కాన్వెంట్ అనే సినిమా చేసినా కూడా ఏ మాత్రం ఉపయోగపడకుండా పోయింది. ఆ సినిమా మా తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కూడా హీరో గా ఏమాత్రం పేరు రాలేదు. ఈ నేపథ్యంలోనే రాఘవేంద్రరావు తో కలిసి చేసిన పెళ్లి సందడి సినిమా ఆయనకు మంచి పేరు తీసుకురాగా ఈ సినిమా తర్వాత పెద్ద సంస్థల నుంచి ఆయనకు అవకాశాలు రావడం విశేషం. రెండు పెద్ద సంస్థలతో ఆయన సినిమాలు చేయబోతున్నట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు హీరోయిన్ శ్రీలీల కూడా మంచి అవకాశాలను అందుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రవితేజ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. అంతే కాదు మరి కొంత మంది యంగ్ హీరోలు కూడా ఈ ముద్దుగుమ్మను హీరోయిన్ గా పెట్టుకునేందుకు ఎంతగానో ఆసక్తిగా చూస్తున్నట్లు తెలుస్తోంది. అలా చేతినిండా ప్రాజెక్టులతో ఈ ఇద్దరు కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. మరి వీరు తమ తదుపరి సినిమాలతో ఏ స్థాయి సక్సెస్ అందుకుంటారో అనేది చూడాలి. కొత్త హీరోలు కొత్త హీరోయిన్ లు రావడం కూడా ఎక్కువైనా నేపథ్యంలో వీరు తమ సినిమాలతో ఏవిధంగా ఆకట్టుకుంటారు ఎ స్థాయి లో ఎదుగుతారు అనేది చూడాలి.