బాలీవుడ్ లో భారీ క్రేజ్ అందుకుంటున్న విజయ్ దేవరకొండ!!
పెళ్లి చూపులు సినిమాతో సాదా సీదా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాలో ఆయన నటనకు ముగ్ధులై పోయి అందరూ విజయ్ దేవరకొండ ను ఎంతో మెచ్చుకున్నారు. అలా తొలి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తో ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ చిత్రం ఆయనను ఆకాశమంత ఎత్తుకు చేర్చింది అని చెప్పవచ్చు. అన్ని భాషల్లోనూ ఈ సినిమా విడుదల కావడంతో ఆయనకు అన్ని భాషలలోనూ గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.
ఆ విధంగా ఆయన చేసిన ప్రతి సినిమా కూడా డబ్ అయ్యి ఇతర భాషల్లో విడుదల కాగా వాటికి కోటానుకోట్ల వియూస్ అందిస్తున్నారు అక్కడి ప్రేక్షకులు. ఆ విధంగానే డియర్ కామ్రేడ్ సినిమా హిందీ డబ్బింగ్ కు సంబంధించిన వ్యూస్ ఇప్పుడు భారీ స్థాయిలో ఉన్నాయి అని చెప్పవచ్చు. ఏకంగా 360 మిలియన్ల వ్యూస్ అందుకుని ఏ సౌత్ సినిమా అందుకోని రికార్డును కొల్లగొట్టింది ఈ చిత్రం. తెలుగులో యావరేజ్ హిట్ కాగా ఈ సినిమాకు బాలీవుడ్ లో వస్తున్న ఆదరణ చూస్తుంటే ఈ సినిమా అక్కడ కూడా విడుదల అయి ఉంటే ఏ స్థాయిలో విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.