ఎన్టీఆర్ కూడా బన్నీ లా ఆలోచిస్తున్నాడు!!

P.Nishanth Kumar


కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్లు అల్లుఅర్జున్ పుష్ప సినిమాతో అలాంటి ప్రయత్నమే చేసి కుంభస్థలాన్ని కొట్టేసాడు. ఎవరి సపోర్టు లేకుండా సోలోగా పుష్ప సినిమా విడుదల చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకున్నాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మార్మోగిపోతోంది అంటే పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో అర్థం చేసుకోవచ్చు. విడుదలైన అన్ని భాషలలోనూ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది అంటే సుకుమార్ హార్డ్ వర్క్ ఏ లెవెల్ లోకి ఉందో.

అయితే రోజులు పెరుగుతున్న కొద్దీ ఏ సినిమాకైనా క్రేజ్ తగ్గుతుంది కానీ ఈ సినిమాకి మాత్రం రోజురోజుకూ క్రేజ్ పెరిగిపోతున్నడం విశేషం. ప్రతి ఒక సెలబ్రిటీ కూడా ఈ సినిమాకు సంబంధించిన డైలాగులను చెబుతూ సోషల్ మీడియాలో సినిమా క్రేజ్ ను మరింతగా పెంచుతున్నారు. ఆ విధంగా బన్నీ అవలంబించిన స్ట్రాటజీని ఇప్పుడు ఎన్టీఆర్ కూడా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఎలాగూ మల్టీస్టారర్ సినిమా కాబట్టి దాని నుంచి ఎంతో కొంత ఇమేజ్ తనకు వస్తుందని భావిస్తున్న ఎన్టీఆర్ సోలో ఇమేజ్ రావాలంటే తప్పకుండా పుష్ప లాగా భారీ కొట్టాల్సిన అవసరం ఉంది. 

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు నచ్చే విధంగా చేయాలని ఆయన భావిస్తున్నాడట. ఆ విధం గానే కథ తయారు చేయమని చెప్పిన ఎన్టీఆర్ కొరటాలశివ కు సూచించాడట. ఈ సినిమా అలా తెరకెక్కడానికి భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ ను ఎంపిక చేసుకోబోతున్నాడనీ తెలుస్తుంది. మరి అంతటి స్థాయిలో ఎన్టీఆర్ చేస్తున్న ఈ ప్లానింగ్ ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది చూడాలి. అల్లు అర్జున్ కు తగిన రీతిలో ఈ సినిమాకు విజయం వరిస్తుందో అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: